ఆ ఇద్దరే రోహిత్ పాలిట శనిలా దాపురించారు.. దెబ్బకు కెప్టెన్సీ ఇచ్చేశాడుగా..

Published : Jan 18, 2026, 06:55 PM IST

Rohit: రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మనోజ్ తివారి బీసీసీఐని విమర్శించాడు. ఈ నిర్ణయం వెనుక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల పాత్ర ఉందని అతడు ఆరోపించాడు. 

PREV
15
వారిద్దరే ఈ ప్లాన్‌కి..

భారత జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారి, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే సారథ్యం నుంచి తొలగించడంపై బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేశాడు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల పాత్ర ఉందని అతడు స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నప్పటికీ, అతడిని సెలెక్టర్లు కెప్టెన్సీ నుంచి తప్పించారని తివారి గుర్తు చేశాడు. ఆ బాధ్యతలను శుభ్ మాన్ గిల్‌కు అప్పగించడాన్ని తప్పుపట్టాడు.

25
సంచలన నిర్ణయాలకు సంకోచించడు..

ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని అధికారికంగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ హోదాలో అజిత్ అగార్కర్ ప్రకటించినప్పటికీ, దీని వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఉందని మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. అగార్కర్ సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించడని తివారి తెలిపినప్పటికీ, అతడి నిర్ణయం వెనుక వేరొకరి పాత్ర కూడా ఉండొచ్చని, అగార్కర్ ఒక్కడే ఇంత పెద్ద సాహసం చేయడని పేర్కొన్నాడు. కోచ్ సూచనల ప్రకారమే చీఫ్ సెలెక్టర్‌గా ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని, దీనికి అగార్కర్, గంభీర్ ఇద్దరూ బాధ్యులని మనోజ్ తివారి ఆరోపించాడు.

35
ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ తొలగింపు

భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించిన కెప్టెన్‌ను తొలగించి, అతని స్థానంలో కొత్త వ్యక్తిని సారథిగా నియమించడం సమంజసం కాదని మనోజ్ తివారి అన్నాడు. ఇది రోహిత్ శర్మను అవమానించినట్లే అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ 2027 ఆడటంపై వారికి సందేహాలు ఎందుకు ఉన్నాయో అర్థం కావడంలేదని అతడు తెలిపాడు. అతడి సామర్థ్యాన్ని అనుమానించడం పొరపాటే అవుతుందని మనోజ్ తివారి స్పష్టం చేశాడు. రోహిత్ ఎవరికీ సాధ్యం కాని విధంగా వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు బాదిన విషయాన్ని మర్చిపోకూడదని గుర్తుచేశాడు.

45
ప్లేయింగ్ ఎలెవన్‌ ఎంపికలో లోపాలు..

మరోవైపు, ప్రస్తుతం భారత తుది జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయని మనోజ్ తివారి ఆరోపించాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంచుకోవడంలో చాలా అసమానతలు ఉన్నాయని గుర్తుచేశాడు. ఈ కారణాల వల్ల తాను వన్డే మ్యాచ్‌లపై ఆసక్తి కోల్పోయానని కూడా తివారి తెలిపాడు. 

55
అతడ్ని అవమానించడమే..

ఏది ఏమైనప్పటికీ, రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం అతడి సామర్థ్యాన్ని అవమానించడమే అవుతుందని మనోజ్ తివారి మరోసారి నొక్కి చెప్పాడు.

Read more Photos on
click me!

Recommended Stories