జింబాబ్వేతో మ్యాచ్..! సెమీస్‌లో నిలవాలంటే భారత్ 11 ఓవర్లకు ఎన్ని రన్స్ సాధించాలంటే.?

Published : Feb 25, 2026, 06:54 PM IST

Team India: భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రన్ రేట్ పెరగాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు ఇలా ఉన్నాయి. కచ్చితంగా ఇలా చేస్తేనే భారత్ తన రన్ రేట్ మెరుగుపరుచుకోగలదు.

PREV
15
సెమీఫైనల్ ఆశలపై నీళ్లు

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8లో భారత జట్టు ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన 76 పరుగుల భారీ ఓటమి టీమిండియా సెమీఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ పరాజయంతో భారత్ నెట్ రన్ రేట్(NRR) ఒక్కసారిగా -3.800కి పడిపోయింది. ఇప్పుడు సెమీఫైనల్ చేరాలంటే భారత్ కేవలం మిగిలిన మ్యాచ్‌ల్లో గెలవడమే కాకుండా, రన్ రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.

25
జింబాబ్వే మ్యాచ్ - రన్ రేట్ సమీకరణాలు

భారత్ తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రన్ రేట్ పెరగాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు ఇలా ఉన్నాయి. కచ్చితంగా ఇలా చేస్తేనే భారత్ తన రన్ రేట్ మెరుగుపరుచుకోగలదు. అయితే రన్ రేట్ మెరుగుపరిస్తే సరిపోదు.. ఆ తర్వాత మ్యాచ్ కూడా గెలిచి.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

35
మొదట బౌలింగ్ చేస్తే

జింబాబ్వేను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలి. ఉదాహరణకు జింబాబ్వే 150 పరుగులు చేస్తే, భారత్ ఆ లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే పూర్తి చేయాలి. ఒకవేళ జింబాబ్వే 90 పరుగులకే పరిమితమైతే, భారత్ 9 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్ రేట్ నెగటివ్ నుంచి పాజిటివ్ జోన్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

45
మొదట బ్యాటింగ్ చేస్తే

ఈ సందర్భంలో రన్ రేట్ పెంచడం మరింత సవాలుతో కూడుకున్న పని. భారత్ కనీసం 220 నుంచి 250 పరుగులు బోర్డుపై ఉంచాలి. అనంతరం జింబాబ్వేను 100 లోపు పరుగులకే ఆలౌట్ చేయాలి. ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయడం వల్ల ఆదా అయ్యే ఓవర్లు రన్ రేట్ గణనలో భారత్‌కు భారీగా కలిసివస్తాయి.

55
సూపర్-8 గ్రూప్ పరిస్థితి

ప్రస్తుతానికి సౌతాఫ్రికా, వెస్టిండీస్ పటిష్ట స్థితిలో ఉండగా, భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో(జింబాబ్వే, వెస్టిండీస్‌తో) తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాలి. రన్ రేట్ మెరుగుపడకపోతే, పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు భారత్ వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. గత మ్యాచ్‌లో భారత్ త్వరగా ఆలౌట్ కావడం రన్ రేట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. జింబాబ్వే వంటి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించి, భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు, బౌలర్లు తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ "డూ ఆర్ డై" పరిస్థితిలో రోహిత్ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories