ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమి.. ఇక పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే దేవుడు దిగి రావాల్సిందే..

Published : Feb 25, 2026, 06:33 PM IST

T20 World Cup: కేవలం 51 బంతుల్లో సెంచరీ బాదిన బ్రూక్.. ఇంగ్లాండ్‌కు 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, పాకిస్థాన్ ఆశలు ఇప్పుడు అడియాశలు అయ్యాయి. 

PREV
15
పాకిస్థాన్ ఘోర పరాజయం

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8లో భాగంగా పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వీరవిహారం చేశాడు. కేవలం 51 బంతుల్లో సెంచరీ బాదిన బ్రూక్.. ఇంగ్లాండ్‌కు 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, పాకిస్థాన్ ఆశలు ఇప్పుడు అడియాశలు అయ్యాయి.

25
పాయింట్ల పట్టిక, ప్రస్తుత పరిస్థితి

సూపర్-8 గ్రూప్-2లో ఇంగ్లాండ్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి ఇప్పటికే సెమీస్ చేరింది. పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒక పాయింట్‌తో(న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు కావడంతో లభించిన పాయింట్) మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 28న శ్రీలంకతో ఆడాల్సి ఉంది.

35
పాకిస్థాన్ సెమీస్ చేరేందుకు ఉన్న మార్గాలు

పాకిస్థాన్ సెమీఫైనల్‌కు వెళ్లాలంటే కేవలం తమ మ్యాచ్ గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడాల్సి ఉంది. పాకిస్థాన్ ఫిబ్రవరి 28న శ్రీలంకను కచ్చితంగా ఓడించాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పాకిస్థాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఫిబ్రవరి 27న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించాలి. అలాగే ఫిబ్రవరి 25న జరిగే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌ను ఓడించాలి. అప్పుడు న్యూజిలాండ్ ఒక్క పాయింట్‌తోనే మిగిలిపోతుంది.

45
పాకిస్థాన్ ఒక మ్యాచ్ గెలిస్తే

ఒకవేళ న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి పాకిస్థాన్ కూడా ఒక మ్యాచ్ గెలిస్తే.. ఇద్దరూ 3 పాయింట్లతో సమానంగా నిలుస్తారు. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ వెళ్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ రన్ రేట్(-0.461) నెగటివ్‌లో ఉంది. కాబట్టి శ్రీలంకపై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది.

55
వర్షం పడితే పరిస్థితి ఏంటి?

ఒకవేళ పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్, శ్రీలంక-న్యూజిలాండ్ మ్యాచ్‌లు రెండూ వర్షం వల్ల రద్దైతే, అప్పుడు అన్ని జట్లూ 2 లేదా 3 పాయింట్ల వద్ద నిలుస్తాయి. ఆ సమయంలో నెట్ రన్ రేట్ మాత్రమే నిర్ణయాత్మకం అవుతుంది. మొత్తానికి, పాకిస్థాన్ సెమీఫైనల్ చేరడం అనేది ఇప్పుడు వారి చేతుల్లో కంటే అదృష్టం, ఇతర జట్ల వైఫల్యంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. హ్యారీ బ్రూక్ సెంచరీతో పాకిస్థాన్ కొంపముంచిన వేళ, బాబర్ ఆజామ్ సేన అద్భుతం జరుగుతుందని ఆశిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories