ఖో ఖో ప్రపంచ కప్ 2025: బ్రెజిల్‌పై భారత్ సూపర్ షో

First Published | Jan 15, 2025, 8:09 PM IST

Kho Kho World Cup 2025: తొలి  ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో నేపాల్ ను ఓడించిన భారత పరుషుల ఖోఖో జట్టు.. రెండో మ్యాచ్ లో బ్రెజిల్ లో తలపడింది. 

Credit: TwitterKho Kho World Cup 2025

ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. జనవరి 14న న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన గ్రూప్ A మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఓడించింది.

ప్రతీక్ వైకర్ నాయకత్వంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై గెలిచి టోర్నీని గెలుపుతో ప్రారంభించింది. ఇప్పుడు ఇదే జోరును కొనసాగిస్తోంది.

Image Credit: TwitterKho Kho World Cup 2025

ఖోఖో ప్రపంచ కప్ 2025 లో బ్రెజిల్ తో జరిగిన రెండో మ్యాచ్ లో భారత జట్టు మొదటి నుంచి అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ గెలిచిన భారత్ మొదట అటాకింగ్ మొదలు పెట్టింది.

మొదటి టర్న్ లో 36 పాయింట్లు సాధించింది. రెండో టర్న్‌లో బ్రెజిల్ దాడి చేసినా, భారత రక్షణను ఛేదించలేకపోయింది. రెండో టర్న్ చివరికి భారత్ 22 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. 

ఖో ఖో ప్రపంచ కప్ 2025: దక్షిణ కొరియాను చిత్తుచేసిన భారత మహిళల జట్టు


Kho Kho World Cup 2025, Kho Kho World Cup, Prateek Waikar

మూడో టర్న్‌లో బ్రెజిల్ పోరాడినా, భారత డిఫెంటర్ల అటాక్ చేయలేకపోయింది. కశ్యప్, సుయాష్, ప్రబానీ అద్భుత ఆటతో అదరగొట్టారు. నాలుగో టర్న్ చివరికి స్కోరు 38-34తో భారత్ ఆధిక్యంలో ఉంది.

చివరి టర్న్‌లో భారత్ దూకుడుగా ఆడి 64-34తో విజయం సాధించింది. ఖోఖో ప్రపంచ కప్ 2025లో ప్రతీక్ వైకర్ నాయకత్వంలోని భారత పరుషుల ఖోఖో జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో నేపాల్ ను ఓడించిన సంగతి తెలిసిందే. 

ఖోఖో వ‌ర‌ల్డ్ క‌ప్ 2025: నేపాల్ చిత్తు.. భార‌త్ ఆరంభం అదిరిపోయింది !

అంతకుముందు, భారత మహిళల జట్టు దక్షిణ కొరియాపై 157 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే, పురుషుల మ్యాచ్‌లలో నేపాల్, పెరూ గ్రూప్ Aలో తమ తొలి విజయాలు నమోదు చేశాయి. గ్రూప్ Bలో దక్షిణాఫ్రికా రెండు విజయాలు సాధించగా, ఇరాన్, ఘనా ఒక్కో విజయం సాధించాయి.

గ్రూప్ Cలో బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవగా, దక్షిణ కొరియా తమ తొలి విజయం నమోదు చేసింది. గ్రూప్ Dలో ఇంగ్లాండ్ వరుసగా రెండు విజయాలు సాధించగా, కెన్యా ఒక మ్యాచ్ గెలిచింది. భారత మహిళల జట్టు బుధవారం, జనవరి 15న పెరూతో తమ మూడో మ్యాచ్ ఆడుతుంది.

Kho Kho World Cup, Kho Kho World Cup 2025,

కాగా, ఖో ఖో ప్రపంచ కప్ 2025 సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఘ‌నంగా ప్రారంభ వేడుకతో ప్రారంభమైంది. 13 నుంచి 19 వ‌ర‌కు టోర్నీ జ‌ర‌గ‌నుంది. భారత ఒలింపిక్ సంఘం (IOA) మద్దతుతో ప్రారంభమైన ఖో ఖో పోటీలో 20 పురుషులు, 19 మహిళల జట్లు పాల్గొంటాయి.

భారత పురుషుల జట్టు నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌లతో గ్రూప్-ఎలో ఉండగా, మహిళల జట్టు గ్రూప్-ఎలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలతో ఉంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Latest Videos

click me!