గువాహటి బర్సపారా స్టేడియంలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మూడో రోజు టీమిండియా అనూహ్యంగా కుప్పకూలింది. ఇప్పటికే భారీ స్కోరు చేసిన సఫారీలకు సమాధానం ఇవ్వాల్సిన భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు చేరారు.
దీంతో మ్యాచ్ పూర్తిగా సౌతాఫ్రికా జట్టు చేతిలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగులు చేయగా, భారత్ మాత్రం 201 వద్ద ఆలౌట్ అయి 288 పరుగుల వెనుకంజలో పడిపోయింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించినా, 65 పరుగుల భాగస్వామ్యం తర్వాత భారత బ్యాటర్ల నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. జైస్వాల్ 58 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ పూర్తిగా నిరాశపరిచింది. సాయి సుదర్శన్, పంత్, జడేజా, జురెల్, నితీష్ రెడ్డి.. ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.