ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా కొత్త చరిత్ర… అశ్విన్ రికార్డ్ బద్దలు

Published : Nov 14, 2025, 01:45 PM ISTUpdated : Nov 14, 2025, 01:51 PM IST

Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 152 క్లీన్ బౌల్డ్‌ వికెట్లు తీసుకుని రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టులో బుమ్రా ఈ ఘనత సాధించాడు.

PREV
15
బుమ్రా రికార్డుల మోత

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజే భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డ్ సాధించాడు. తన కచ్చితమైన లైన్, లెంగ్త్ పేస్ బౌలింగ్ తో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ కు పంపాడు. 

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక పెద్ద మైలురాయిని చేరుకున్నాడు. బుమ్రా క్లీన్ బౌల్డ్‌లతో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ల జాబితాలో ఇప్పుడు మూడో స్థానానికి చేరాడు. ఈ ప్రదర్శనతో అతను రవిచంద్రన్ అశ్విన్‌ను అధిగమించాడు.

25
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 3 కీలక వికెట్లు

మ్యాచ్ మొదటి రోజునే బుమ్రా తన పేస్ స్పెల్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అతను తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు మూడు కీలక వికెట్లు తీశాడు. ర్యాన్ రికెల్టన్‌ను 23 పరుగుల వద్ద, ఐడెన్ మార్క్రామ్ ను 31 పరుగుల వద్ద, టోని డీ జార్జీని 24 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపించాడు.

రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన క్షణంలోనే బుమ్రా తన కొత్త రికార్డును నమోదుచేశాడు. ఈ బౌల్డ్ వికెట్ అతన్ని భారత బౌలర్ల ఆల్‌టైమ్ జాబితాలో మరింత ముందుకు తీసుకెళ్లింది.

35
అశ్విన్ రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బుమ్రా ఇప్పటి వరకూ 220 మ్యాచ్‌ల్లో 152 క్లీన్ బౌల్డ్‌ వికెట్లు తీశాడు. మరోవైపు అశ్విన్ 287 మ్యాచ్‌ల్లో 151 బౌల్డ్ వికెట్లు పొందాడు. బుమ్రా ఇప్పుడు అశ్విన్‌ను 1 వికెట్ తేడాతో అధిగమించాడు.

ఈ జాబితాలో అతనికి ముందుగా ఉన్న వారు కేవలం ఇద్దరు భారత దిగ్గజాలు మాత్రమే. వారే అనిల్ కుంబ్లే – 186 బౌల్డ్ వికెట్లు, కపిల్ దేవ్ – 167 బౌల్డ్ వికెట్లు.

బుమ్రా ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక బోల్డ్ వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా నిలిచాడు.

45
సౌతాఫ్రికా తొలి సెషన్ స్కోరు: 105/3

మ్యాచ్ తొలి సెషన్‌లో సౌతాఫ్రికా మంచి ఆరంభం చేసినా, భారత బౌలర్లు రీఎంట్రీతో అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన సౌతాఫ్రికా జట్టు 27 ఓవర్లలో 105 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.

మార్క్రామ్, రికెల్టన్ మొదటి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రికెల్టన్ 22 బంతుల్లో 23 పరుగులు చేశాడు. మార్క్రామ్ 48 బంతుల్లో 31 పరుగులతో ఔట్ అయ్యాడు.

కెప్టెన్ టెంబా బావుమా కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. ఈ దశలో సౌతాఫ్రికా 71 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.  ప్రస్తుతం 148/7 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత బౌలర్లు అదరగొడుతున్నారు.

55
అంతర్జాతీయ క్రికెట్‌లో క్లీన్ బౌల్డ్‌లతో అత్యధిక వికెట్లు తీసిన భారతీయులు

1. అనిల్ కుంబ్లే - 186 వికెట్లు

2. కపిల్ దేవ్ - 167 వికెట్లు

3. జస్ప్రీత్ బుమ్రా - 152 వికెట్లు

4. రవిచంద్రన్ అశ్విన్ - 151 వికెట్లు

5. రవీంద్ర జడేజా - 145 వికెట్లు

Read more Photos on
click me!

Recommended Stories