Ishan Kishan Net Worth: ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత టీమిండియా జెర్సీలో ఆడబోతున్నాడు... ఈ క్రమంలో సోషల్ మీడియాలో అతడిపై తెగ చర్చ సాగుతోంది. మైదానంలో సత్తా చాటడమే కాదు సంపాదన విషయంలోనూ దుమ్మురేపుతున్నాడు.
Ishan Kishan : ఎడమచేతి వాటం టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం అతడిని సెలెక్టర్లు ఎంపికచేశారు. నాగ్‌పూర్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు తుది జట్టులో ఇషాన్ అందుబాటులో ఉంటాడు… ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ధృవీకరించాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత ఇషాన్ కిషన్ భారత జెర్సీలో కనిపించనున్నాడు.
25
ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇషాన్ రికార్డులు..
ఇషాన్ కిషన్ ఒక అద్భుతమైన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. టీమిండియా తరఫున అనేకసార్లు మైదానంలో సత్తా చాటాడు... వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా బాదాడు. బంగ్లాదేశ్‌పై వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఇతడిపేరిటే ఉంది. అయితే బీసీసీఐ నిబంధనలు పాటించకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు... సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో మళ్లీ జట్టులోకి వచ్చాడు.
35
సంపాదనలోనూ ఇషాన్ టాప్
అయితే ఆటలోనే కాదు సంపాదన విషయంలోనూ ఇషాన్ కిషన్ చాలా ముందున్నాడు. కొన్ని రిపోర్టుల ప్రకారం... ఇషాన్ నికర ఆస్తి విలువ రూ. 60 నుంచి 70 కోట్లు ఉంటుందట. ఐపీఎల్ 2025 మెగా వేలంలో తెలుగు టీం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో సి-గ్రేడ్‌లో ఉన్నందుకు ఏటా రూ. 1 కోటి అందుకుంటాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నాడు ఈ యువ క్రికెటర్.
టీమిండియా క్రికెటర్లు విలాసవంతమైన జీవితానికి పెట్టింది పేరు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అతనికి స్వస్థలం పాట్నా (బీహార్) తో పాటు ముంబై (మలాడ్)లో లగ్జరీ ఇండ్లు ఉన్నాయి. ఈ ఇళ్లలో జిమ్, స్విమ్మింగ్ పూల్, పెద్ద లివింగ్ రూమ్ లాంటి అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అతని ఇల్లు చాలా స్టైలిష్‌గా, అన్ని సౌకర్యాలతో ఉంటుంది.
55
ఇషాన్ కిషన్ వద్ద లగ్జరీ కార్లు
ఇషాన్ కిషన్‌కు కార్లంటే చాలా ఇష్టం. అతని దగ్గర ఒకటి కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో మెర్సిడెస్ బెంజ్ GLS, BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్టాంగ్ GT, ఆడి Q7, రేంజ్ రోవర్ వోగ్ ఉన్నాయి. ఈ కార్లు అతని విలాసవంతమైన జీవితానికి నిదర్శనం. ఈ కార్ల విలువ కోట్లలో ఉంటుంది.