తూచ్.! ఆ ఇద్దరు టీమిండియా తోపు ప్లేయర్స్ మాతోనే.. ఫ్రాంచైజీల యూటర్న్

Published : Nov 06, 2025, 08:30 PM IST

Team India: ఐపీఎల్ 2026 ట్రేడ్ డీల్స్ రెండు ముఖ్యమైన అప్‌డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కేఎల్ రాహుల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన మూడు ఆఫర్‌లను తిరస్కరించింది. 

PREV
15
ట్రేడ్ డీల్స్ ఇదిగో..

ఐపీఎల్ 2026 ట్రేడ్ డీల్స్ రెండు ముఖ్యమైన అప్‌డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ట్రేడ్‌లు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఆటగాళ్లను వారి ప్రస్తుత ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకునే అవకాశం ఉంది.

25
గుజరాత్ తోనే ఆ ప్లేయర్..

వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టైటాన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్తున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సుందర్‌ను వదులుకోవడానికి నిరాకరించడంతో ఈ ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయింది. అటు కేఎల్ రాహుల్ ట్రేడ్ కూడా క్యాన్సిల్ అయినట్టు సమాచారం. కేఎల్ రాహుల్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ముందు మూడు ప్రతిపాదనలు ఉంచింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే వాటిని కేకేఆర్ వద్దని తెగేసి చెప్పిందట.

35
మొదటి ఛాయస్ ఇది..

ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ప్రతిపాదన ఇలా.. సునీల్ నరైన్‌తో రాహుల్‌ను స్వాప్ చేయాలని చూసింది. రాహుల్ ధర రూ. 14 కోట్లు కాగా, నరైన్ ధర రూ.12 కోట్లు. ఇలా స్వాప్ చేసి అదనంగా రూ. 2 కోట్లు ఇవ్వాలనుకుంది. అయితే ఇందుకు కేకేఆర్ వద్దని తెగేసి చెప్పింది. నరైన్ సీనియర్ అయినప్పటికీ.. జట్టుకు చాలా మ్యాచ్‌లను గెలిపించాడని.. అతని ఐపీఎల్ కెరీర్ మొత్తం కేకేఆర్‌తోనే ముడిపడి ఉందని పేర్కొంది కేకేఆర్. నరైన్ ఫామ్ కూడా పెద్దగా తగ్గలేదని భావించింది.

45
రెండో ఛాయస్ ఇది..

రెండవ ప్రతిపాదనలో ఢిల్లీ.. కేఎల్ రాహుల్‌కు బదులుగా రింకూ సింగ్, అంక్రిష్ రఘువంశిలను అడిగింది. రింకు ధర రూ.13 కోట్లు, అంక్రిష్ ధర రూ. 3 కోట్లు.. మొత్తం రూ.16 కోట్లు. ఈ డీల్‌లో ఢిల్లీ రూ. 2 కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీకి ఇది లాభదాయకమైన డీల్ అయినప్పటికీ, కేకేఆర్ తమ యువ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌ను.. అలాగే అంక్రిష్ రఘువంశిని వదిలి పెట్టేందుకు సిద్దంగా లేదు.

55
మూడో ఛాయస్ ఇది..

మూడవ ప్రతిపాదన అంక్రిష్ రఘువంశి, హర్షిత్ రాణాలను ఇచ్చి రాహుల్‌ను తీసుకోవడం. హర్షిత్ రాణా ధర రూ. 4 కోట్లు, అంక్రిష్ ధర రూ. 3 కోట్లు.. మొత్తంగా రూ. 7 కోట్లు. ఈ డీల్‌లో కేకేఆర్ రూ. 7 కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మినీ వేలానికి పర్స్ ఖాళీ అవుతుందని కేకేఆర్ అనుకుంటోంది. పైగా హర్షిత్ రాణా కేకేఆర్ జట్టుకు ప్రధాన ఫాస్ట్ బౌలర్.. అందుకే ఈ ట్రేడ్ కూడా ఆగిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories