IPL 2026: అందుకే ఓపెనర్‌గా వచ్చా.. ఓటమిపై మా ఓనర్ తిట్టలేదు.. కానీ.! రిషబ్ పంత్

Published : Apr 02, 2026, 07:07 PM IST

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపై కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించారు. యజమాని సంజీవ్ గోయెంకాతో జరిగిన చర్చ, తన రనౌట్ పై పంత్ ఇచ్చిన వివరణ ఇచ్చాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకోండి. 

PREV
15
లక్నో ఓటమిపై రిషబ్ పంత్ వివరణ..

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సొంత మైదానమైన ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ల వైఫల్యం జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది.

25
బ్యాటింగ్ వైఫల్యం, రనౌట్

ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 7 పరుగులకే రనౌట్ కావడంతో లక్నో కష్టాల్లో పడింది. జట్టు కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేక, 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన మార్పులు, ఆయుష్ బదోనిని ముందుకు పంపడం వంటి ప్రయోగాలు ఏవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

35
బౌలింగ్ బాగున్నా ఎక్స్‌ట్రాలే దెబ్బ..

తక్కువ టార్గెట్ ఉన్నప్పటికీ బౌలర్లు పోరాడారని పంత్ తెలిపాడు. అయితే ఢిల్లీకి ఏకంగా 20 ఎక్స్‌ట్రా పరుగులు సమర్పించుకోవడం తమ విజయ అవకాశాలను దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ తరపున ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.

45
యజమాని సంజీవ్ గోయెంకాతో చర్చ

మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే యజమాని సంజీవ్ గోయెంకా, రిషబ్ పంత్‌తో సీరియస్‌గా చర్చిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై పంత్ స్పందిస్తూ, ఓటమికి గల కారణాలను గోయెంకా అడిగి తెలుసుకున్నారని, మేనేజ్మెంట్ ప్లాన్స్ గురించి చర్చించారని వెల్లడించాడు.

55
ఓపెనర్‌గా పంత్ కొనసాగుతాడా?

సీజన్ మొత్తం తాను ఓపెనర్‌గా ఆడతానా లేదా అనే విషయంపై పంత్ స్పష్టత ఇవ్వలేదు. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చానని, రనౌట్ కావడం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పడంపై దృష్టి పెడతామని ధీమా వ్యక్తం చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories