Published : Jul 23, 2025, 08:15 AM ISTUpdated : Jul 23, 2025, 08:24 AM IST
మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. దీంతో వన్డే సీరిస్ 2-1 తేడాతో టీమిండియా గెలుచుకుంది. హర్మన్ ప్రీత్ సెంచరీ, క్రాంతి గౌడ్ ఆరు వికెట్లు తీసి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.
India Womens vs England Womens : ఉమెన్స్ క్రికెటర్ల ఆల్రౌండ్ షో టీమిండియాకు మరో అద్భుత విజయాన్ని అందించింది. ఇంగ్లాండ్ ను వారి దేశంలోని చిత్తుచిత్తుగా ఓడించి ఇప్పటికే టీ20 సీరిస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సీరిస్ ను కూడా గెలుచుకుంది. హర్మన్ ప్రీత్ బ్యాట్ తో... క్రాంతి గౌడ్ బంతితో రాణించడంతో నిర్ణయాత్మక మూడో వన్డేలో సూపర్ విక్టరీ సాధించింది భారత జట్టు. దీంతో మూడు వన్డేల సీరిస్ ను 2-1 తేడాతో భారత మహిళా టీం గెలుచుకుంది.
25
మూడో వన్డేలో టీమిండియా విజయం
టీ20 సీరిస్ గెలిచిన ఊపులో వన్డే సీరిస్ ప్రారంభించిన టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతంగా ఆడారు... దీంతో మొదటి వన్డేలో విజయం సాధించారు. అయితే రెండో వన్డేలో వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు సరైన ఆటతీరు కనబర్చలేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో మూడో వన్డే కీలకంగా మారింది... వన్డే సీరిస్ విజయాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఇరుజట్లు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. తమ శక్తిమేరకు ఇండియా, ఇంగ్లాండ్ గెలుపుకోసం ప్రయత్నించారు... కానీ చివరకు విజయం టీమిండియాకే దక్కింది.
35
భారత బ్యాటర్లు అదరగొట్టారు
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు అద్భుత ఆరంభం లభించింది. సక్సెస్ ఫుల్ ఓపెనింగ్ జోడీ స్మృతి మంధాన 45, ప్రతీక రావల్ 26 పరుగులతో హాఫ్ సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత హర్లీల్ డియోల్ కూడా 45 పరుగులతో రాణించారు. జెమ్మిమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో అదరగొడితే, రిచా గోష్ మెరుపు ఇన్నింగ్స్ (18 బంతుల్లో 38 పరుగులు) అభిమానులను ఆకట్టుకుంది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ఎంతచెప్పినా తక్కువే... ఆమె బ్యాటింగ్ నభూతో నభవిష్యత్ అన్నట్లు సాగింది. సొగసరి షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ ఆమె కేవలం 84 బంతుల్లోనే సెంచరీ (102 పరుగులు) సాధించారు... ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ బ్యాట్ తో అదరగొట్టడంతో టీమిండియా భారీ స్కోరు (318 పరుగులు) సాధిచింది.
55
క్రాంతి గౌడ్ సూపర్ బౌలింగ్
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను ఆరంభంలోనే దెబ్బతీశారు క్రాంతి గౌడ్. వరుసగా ఓపెనర్లిద్దరి వికెట్లు పడగొట్టారు. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ పుంజుకుని పోరాడినా టీమిండియాను ఓడించలేకపోయింది...305 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 13 పరుగుల తేడాతో టీమిండియా ఉమెన్స్ టీం విజయం సాధించింది... మూడు వన్డేల సీరిస్ ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సెంచరీతో, క్రాంతి గౌడ్ 6 వికెట్లతో ఇంగ్లాండ్ ఓటమిని శాసించారు.