India Wins T20 World Cup 2026 : పిచ్చిలో మట్టిని ముఖానికి రాసుకున్న సూర్య కుమార్ యాదవ్

Published : Mar 08, 2026, 11:39 PM IST

India Wins T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ మట్టిని ముఖానికి రాసుకుని వేడుకలు చేసుకోవడం వైరల్ గా మారింది.

PREV
16
అహ్మదాబాద్ లో దుమ్మురేపిన భారత్.. టీ20 ప్రపంచ కప్ మనదే

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి, టీమ్ ఇండియా మూడోసారి పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా అవతరించింది. సూర్యకుమార్ యాదవ్ సారధ్యంలో భారత్ అజేయంగా నిలిచి, యావత్ క్రికెట్ ప్రపంచం గర్వించేలా అద్భుత ప్రదర్శన చేసింది.

26
సూర్యకుమార్ యాదవ్ మట్టి సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో

భారత్ విజయం ఖరారైన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో చేసిన పని ప్రతి భారతీయుడి హృదయాన్ని హత్తుకుంది. గెలిచిన ఆనందంలో పరిగెత్తుకుంటూ పిచ్ వద్దకు వెళ్లిన సూర్య, తన చేతులతో ఆ మట్టిని తాకి, తన నుదుటిపై నుంచి ముఖం మీదుగా రాసుకున్నారు. తనను ప్రపంచ విజేతగా నిలబెట్టిన ఆ 22 గజాల పిచ్‌ను గుడిలా భావించి అతను చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గ్లామర్, టెక్నాలజీతో నిండిన ఆధునిక క్రికెట్‌లో, సూర్య చూపిన ఈ స్వచ్ఛమైన దేశభక్తి, క్రీడా స్ఫూర్తి అభిమానులను ఫిదా చేసింది.

36
విక్టరీ మ్యాడ్నెస్: గ్లాడియేటర్ సూర్య

గతంలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి లోనవుతారనే విమర్శలను సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీతో పటాపంచలు చేశాడు. మైదానంలో మట్టి కొట్టుకున్న ముఖంతో ట్రోఫీని ఎత్తుకున్న సూర్య ఫొటోలు ఒక సినిమా క్లైమాక్స్ లా కనిపించాయి. "ఈ మట్టి ఈరోజు మట్టిలా అనిపించడం లేదు, బంగారు ధూళిలా మెరుస్తోంది" అనేలా సూర్య మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించడం విశేషం. ఈ గెలుపు భారత క్రికెట్‌లో ఒక నవశకానికి నాంది పలికింది.

46
బ్యాటింగ్ విధ్వంసం.. సంజూ శాంసన్ మెరుపులు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, సంజూ శాంసన్ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి కివీస్ బౌలర్లను ఉతికేశాడు. ఈ భారీ స్కోరుతో న్యూజిలాండ్ ఆరంభంలోనే ఒత్తిడికి లోనైంది.

56
న్యూజిలాండ్ దెబ్బకొట్టిన బౌలర్లు

256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తలవంచింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (52) మినహా మరెవ్వరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసి ట్రోఫీని ముద్దాడింది.

66
భారత్ సృష్టించిన 3 చరిత్రాత్మక ప్రపంచ రికార్డులు ఇవే

ఈ విజయంతో టీమ్ ఇండియా మూడు ప్రధాన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది..

1. మూడు సార్లు విజేత: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మూడుసార్లు (2007, 2024, 2026) ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

2. అతిథ్య దేశంగా విజయం: టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చి, సొంత గడ్డపై కప్పు గెలిచిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఏ దేశం కూడా హోస్ట్ గా ఉండి టైటిల్ గెలవలేదు.

3. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్: 2024లో విజేతగా నిలిచిన భారత్, ఇప్పుడు 2026లో కూడా గెలిచి, వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర పుటల్లోకెక్కింది.

Read more Photos on
click me!

Recommended Stories