IND vs NZ: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న భారత్–న్యూజిలాండ్ తుది పోరుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అహ్మదాబాద్ చేరుకుని టీమ్ ఇండియాకు మద్ధతు తెలిపారు.
భారత్ ఫైనల్‌కు చేరడంతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించిన మంత్రి నారా లోకేశ్ అహ్మదాబాద్‌కు వెళ్లారు. టీమ్ ఇండియా జెర్సీ టీ షర్ట్ ధరించి స్టేడియానికి చేరుకున్న ఆయన స్టైలిష్‌గా కనిపించారు. స్టేడియం వద్దకు చేరుకున్నప్పుడు అభిమానులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దేశం కోసం పోరాడుతున్న భారత జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నానని లోకేశ్ తెలిపారు.
24
గ్యాలరీ నుంచి టీమ్ ఇండియాకు మద్ధతు
నరేంద్ర మోదీ స్టేడియం గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు. భారత్ కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోవడంతో మ్యాచ్‌కు పండుగ వాతావరణం నెలకొంది.
34
కొలంబో మ్యాచ్‌పై వచ్చిన విమర్శలకు సమాధానం
ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా కొలంబోలో జరిగిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు వెళ్లిన సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ డబ్బుతో మ్యాచ్ చూడటానికి వెళ్లినట్లు ప్రచారం చేయడం తప్పు అని ఆయన తెలిపారు. విమాన టికెట్ కూడా తనదే, మ్యాచ్ టికెట్ కూడా తనదేనని స్పష్టం చేశారు.
ఈ విషయంపై ఆయన Xలో స్పందిస్తూ విమర్శలను ఖండించారు. “ఫ్లైట్ టికెట్ నా ఖర్చు, మ్యాచ్ టికెట్ కూడా నా ఖర్చే. నా డబ్బులతోనే మ్యాచ్ చూసాను” అంటూ తనదైన శైలిలో స్పందించారు. అలాగే భారత్ ఫైనల్‌కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్తానని ముందే చెప్పినట్లు తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి కూడా వస్తానంటే ఆయనకు టికెట్ తీసి మ్యాచ్ చూపిస్తానని చమత్కరించిన విషయం తెలిసిందే. కాగా చెప్పినట్లే ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు లోకేష్ గుజరాత్ వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.