India vs South Africa : అహ్మదాబాద్‌లో జరిగిన సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. అంతకుముందు బుమ్రా బౌలింగ్‌తో ప్రోటీస్‌ను కట్టడి చేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 పోరులో భారత్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మార్క్రామ్ వేసిన స్లో ఆఫ్ బ్రేక్ బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించి కవర్స్ వైపు గాలిలోకి బంతిని లేపాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ర్యాన్ రికెల్టన్ సునాయాస క్యాచ్ అందుకోవడంతో కిషన్ సున్నా పరుగులకే వెనుదిరిగాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గ్రూప్ దశలో యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా డకౌట్ అయిన అభిషేక్ శర్మ, ఈ మ్యాచ్‌లో మాత్రం ఖాతా తెరిచాడు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం అనూహ్యంగా డకౌట్ రూపంలో నిరాశపరిచాడు. కేవలం 27 పరుగులకే భారత్ 3 కీలక వికెట్లు (ఇషాన్ కిషన్ 0, తిలక్ వర్మ 1, అభిషేక్ శర్మ 15) కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
25
మళ్లీ నిరాశ పరిచిన అభిషేక్ శర్మ
భారీ అంచనాలతో వరల్డ్ కప్ లో ఆడుతున్న యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. తుపాను ఆటతో చెలరేగే అభిషేక్ శర్మ వర్ల్డ్ కప్ ఇప్పటివరకు అతని నుంచి ఒక్క ఇన్నింగ్స్ కూడా రాలేదు. లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్ లలో డకౌట్ అయిన నిరాశపరిచాడు. ఇప్పుడు కీలకమైన సూపర్ 8 దశలో అతని నుంచి మంచి నాక్ వస్తుందని అందరూ భావించారు. కానీ అలాంటిది జరగలేదు. కొంచెం మాత్రమే మారింది.. గత మూడు మ్యాచ్ లలో డకౌట్ అయిన అభిషేక్.. ఈ మ్యాచ్ లో పరుగుల ఖాతా తెరిచి మంచి టచ్ లో కనిపించాడు. కానీ, ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మార్కో జాన్సన్ బౌలింగ్ లో బోష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.
అలాగే, తిలక్ వర్మ కూడా 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 11 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులతో కష్టాల్లో పడింది.
35
మిల్లర్ విధ్వంసం.. ఆదుకున్న బ్రెవిస్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఒకానొక దశలో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ప్రోటీస్ జట్టును సీనియర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన అనుభవంతో ఆదుకున్నాడు. మిల్లర్ కేవలం 35 బంతుల్లోనే 63 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతనికి యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45 పరుగులు) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల వేగవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వీరిద్దరూ చెలరేగి ఆడారు.
భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తన స్పెల్‌లో ఏకంగా 12 డాట్ బాల్స్ వేయడం విశేషం. మరోవైపు అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా ఆరంభంలోనే వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ, మధ్య ఓవర్లలో మిల్లర్, బ్రెవిస్ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
55
చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న పాండ్యా
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చివరలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు. 24 బంతుల్లోనే 44 పరుగులు చేసిన స్టబ్స్, ప్రోటీస్ స్కోరును 185 దాటించాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో స్టబ్స్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే హార్దిక్ 20 పరుగులు సమర్పించుకోవడంతో భారత్ ముందు సవాల్‌తో కూడిన లక్ష్యం నిలిచింది. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న వేళ, భారత టాప్ ఆర్డర్ వైఫల్యం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.