India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఓటమి అనంతరం బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. రెండో టెస్టు కోసం పేస్ పిచ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిరీస్ కాపాడుకోవాలంటే భారత్‌కు ఈ టెస్ట్ కీలకం.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టు ఓటమి అనంతరం టీమిండియా మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడింది. ముఖ్యంగా సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే రెండో టెస్టులో తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో, గౌహతిలో జరగనున్న రెండో టెస్టు కోసం పేస్ పిచ్‌ను సిద్ధం చేస్తున్నారనే సమాధానం బలంగా వినిపిస్తోంది.
25
మొదటి టెస్టులో ఓటమి తర్వాత
తొలి టెస్టులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బంతిని బాగా గింగిరాలు తిప్పింది. ఇది బ్యాట్స్‌మెన్‌లను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. భారత మేనేజ్‌మెంట్ సూచనల మేరకే పిచ్‌ను సిద్ధం చేశారని క్యూరేటర్ ధృవీకరించడంతో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా దీనిపై సమర్థించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండో టెస్టుకు ఎలాంటి పిచ్‌ను సిద్ధం చేస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది. మొదటి టెస్టులో ఓటమి తర్వాత అందరి దృష్టి రెండో టెస్టు పిచ్‌పైనే పడింది.
35
ఆటగాళ్ల గాయాలు ఆందోళన
మరోవైపు, టీమిండియాకు ఈ కీలక సమయాన ఆటగాళ్ల గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తొలి టెస్టు మధ్యలోనే మెడనొప్పితో వైదొలిగిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెండో టెస్టులో ఆడటం అనుమానంగానే ఉంది. గిల్ దూరం అయితే, తాత్కాలిక సారథిగా పంత్ వ్యవహరించే అవకాశం ఉంది. గిల్ స్థానంలో బ్యాటింగ్ చేసేది ఎవరు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం సాయి సుదర్శన్, పడిక్కల్ మాత్రమే ఆప్షన్‌లుగా ఉన్నట్లు సమాచారం. అల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో అతను జట్టులో చేరాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైన టీమిండియా గౌహతిలో జరిగే రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం. ఇప్పటికే గౌహతికి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది.
55
డబ్ల్యూటీసీ ఫైనల్స్ రేసులో వెనుకంజ
సఫారీలు ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా లేదా గెలిచినా కూడా సిరీస్ వారి సొంతం అవుతుంది. అంతేకాకుండా, భారత్ గడ్డపై సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ రేసులో వెనకబడిన టీమిండియాకు, ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత అవసరం. స్పోర్టింగ్ పిచ్‌పై సౌత్ ఆఫ్రికా జోరుకు టీమిండియా ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.