భల్లాలదేవుడి కోసం భిక్షు యాదవ్‌ను వదిలేశారుగా.. ఇదేం దిక్కుమాలిన స్ట్రాటజీ KKR.!

Published : Nov 20, 2025, 12:11 PM IST

KKR ఐపీఎల్ మినీ-ఆక్షన్ కోసం రూ. 64.3 కోట్ల భారీ పర్స్‌తో సిద్ధంగా ఉంది. ఆండ్రీ రస్సెల్‌ను అనూహ్యంగా విడుదల చేయడంతో, జట్టు కీలక స్థానాలను భర్తీ చేయడంలో తలమునకలు అవుతోంది. 

PREV
15
భారీ పర్స్‌తో కేకేఆర్..

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ మినీ-ఆక్షన్ 2026 కోసం రూ. 64.3 కోట్ల భారీ పర్స్‌తో సిద్ధంగా ఉంది. మినీ వేలానికి ముందు ఓ జట్టు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అట్టిపెట్టుకోవడం అసాధారణం అని చెప్పొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వంటి ఇతర జట్లతో పోలిస్తే, కేకేఆర్ వద్ద రూ. 20 కోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది వారికి కావాల్సిన ఏ ఆటగాడిని అయినా కొనుగోలు చేసేందుకు బలాన్ని చేకూరుస్తుంది.

25
రస్సెల్‌ను ఎందుకు వదిలేశారు.?

కేకేఆర్ తీసుకున్న అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయాలలో ఒకటి ఆండ్రీ రస్సెల్‌ను విడిచిపెట్టడమే. పుష్కర కాలం పాటు జట్టుకు సేవలందించిన రస్సెల్‌ను కేకేఆర్ విడుదల చేయడాన్ని చాలామంది అభిమానులు ఊహించలేదు. 2020లో కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్, రస్సెల్ ఎప్పటికీ నైట్ రైడర్‌గా ఉంటాడని, కేకేఆర్ జెర్సీలోనే రిటైర్ అవుతాడని ట్వీట్ చేశారు. అయినప్పటికీ, ఇప్పుడు రస్సెల్‌ను విడుదల చేశారు. రస్సెల్ ప్రైస్ రూ. 12 కోట్లు మాత్రమే ఉన్నందున, అతన్ని నిలబెట్టుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం తీసుకున్నారు. రస్సెల్ ఫామ్ తగ్గడం, వయసు పెరగడం, ఆల్-రౌండర్ ప్రదర్శన సరిగ్గా లేకపోవడం లాంటివి ఈ నిర్ణయానికి దారితీసినట్లు అంచనా.

35
భారత్ కోర్ ను అట్టిపెట్టుకుంది

రస్సెల్‌తో పాటు, కేకేఆర్ విదేశీ ఆటగాళ్లలో చాలా మందిని విడుదల చేసింది. సునీల్ నరైన్, పావెల్ మాత్రమే అట్టిపెట్టుకుంది. ప్రస్తుతానికి కేకేఆర్ 12 మంది ఆటగాళ్లను(10 మంది దేశీయ, ఇద్దరు విదేశీ) అట్టిపెట్టుకుంది. దీంతో భారతీయ ఆటగాళ్ల కోర్ దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, విదేశీ ఆటగాళ్ల విభాగంలో పెద్ద ఖాళీలు ఉన్నాయి.

45
కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్ అంచనా

కేకేఆర్ జట్టులో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లతో అంచనా వేసిన ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండబోతోంది.. సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది. రెండవ ఓపెనర్‌గా విదేశీ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్, టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, జోష్ ఇంగ్లిస్ లాంటి ప్లేయర్స్ ఇతర ఆప్షన్లుగా ఉన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో అజింక్య రహానే, అంక్రిష్ రఘువంశీ బరిలోకి దిగబోతున్నారు.

55
రస్సెల్‌ను అందుకే వదిలేశారా.?

రస్సెల్ నిష్క్రమణతో నెం. 5 స్థానం ఖాళీ అయింది. కామెరూన్ గ్రీన్‌ను రస్సెల్‌కు ప్రత్యామ్నాయంగా కేకేఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది. గ్రీన్, అవసరమైతే ఓపెనర్‌గా కూడా ఆడగలడు. ఆపై ఫినిషర్లుగా రింకూ సింగ్, రమణదీప్ సింగ్ ఉన్నారు. ఇలా చూస్తే కేకేఆర్ మినీ-ఆక్షన్‌లో రెండవ ఓపెనర్(వికెట్ కీపర్), ఆల్-రౌండర్, విదేశీ ఫాస్ట్ బౌలర్, ఒక ఎక్స్‌ప్లోజివ్ ఇండియన్ బ్యాట్స్‌మెన్(ఇంపాక్ట్ ప్లేయర్) స్థానాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories