IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?

Published : Dec 20, 2025, 10:29 PM IST

India vs Pakistan U19 Final : అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో ఆదివారం భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. రికార్డు స్థాయిలో 8వ సారి టైటిల్ నెగ్గాలని భారత్ భావిస్తోంది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలో పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
భారత్ vs పాకిస్థాన్ U19 ఆసియా కప్ ఫైనల్: హై-వోల్టేజ్ పోరుకు వేళాయే.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఆసక్తిని పెంచిన ఈ మ్యాచ్ ఆదివారం (డిసెంబర్ 21) జరగనుంది.

ఇప్పటికే గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత యువ జట్టు, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడాలని భావిస్తోంది. దాయాదుల చరిత్ర, తీవ్రమైన ఒత్తిడి మధ్య జరిగే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచనుంది.

26
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి భారత్

ప్రస్తుత ఫామ్, గణాంకాలను పరిశీలిస్తే, ఆయుష్ మ్హత్రే నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నమెంట్ భారత జట్టు ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గ్రూప్-A లో జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది.

ముఖ్యంగా, కేవలం ఒక వారం క్రితం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఏకంగా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్‌కు చేరగా, బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

36
బ్యాటింగ్‌లో టీమిండియా బలం

ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత బలంగా కనిపిస్తోంది. టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు 400లకు పైగా పరుగులు సాధించడం భారత బ్యాటింగ్ సత్తాకు నిదర్శనం. యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ పాక్ బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు.

మిడిల్ ఆర్డర్‌లో ఎరోన్ జార్జ్ నిలకడగా రాణిస్తుండగా, చివరి ఓవర్లలో మ్యాచ్‌ను ముగించడంలో కనిష్క్ చౌహాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఓపెనింగ్ నుండి లోయర్ ఆర్డర్ వరకు భారత బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా ఉండటం జట్టుకు పెద్ద సానుకూల అంశం.

46
పాకిస్థాన్ బౌలింగ్ దాడిని తక్కువ అంచనా వేయలేం

గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ, పాకిస్థాన్ జట్టును తక్కువ అంచనా వేయడం పొరపాటే అవుతుంది. ఫైనల్ మ్యాచ్‌లో వారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్ ప్రధాన బలం వారి పేస్ బౌలింగ్ విభాగం. వారి బౌలర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. పాక్ ఆటగాడు సమీర్ మిన్హాస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.

అయితే, పాకిస్థాన్ బ్యాటింగ్ విభాగం మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. వారి బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడం ఆ జట్టుకు మైనస్‌గా మారింది. అయినప్పటికీ, ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి పాక్ జట్టు అద్భుతాలు చేసి టైటిల్ గెలవాలని చూస్తోంది.

56
భారత్ vs పాకిస్తాన్ U-19 మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు గమనిస్తే..

• మ్యాచ్ తేదీ: డిసెంబర్ 21, 2025 ఆదివారం

• సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ ఉదయం 10:00 గంటలకు.

• టీవీ ఛానెల్స్: ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది.

సోనీ స్పోర్ట్స్ టెన్ 1 (Sony Sports Ten 1) SD & HD.

సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (Sony Sports Ten 3) SD & HD (హిందీ).

సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (Sony Sports Ten 4) SD (తమిళం, తెలుగు కామెంటరీ).

• ఆన్‌లైన్ స్ట్రీమింగ్: మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో చూసేవారి కోసం 'సోనీ లివ్' (Sony LIV) యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. దీనికోసం సబ్ స్క్రిప్షన్ అవసరం.

66
భారత్ vs పాకిస్తాన్ ఇరు జట్ల పూర్తి వివరాలు ఇవే

ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగనున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11, పూర్తి స్క్వాడ్ వివరాలు గమనిస్తే..

భారత్ అండర్-19 ప్రాబబుల్ ప్లేయింగ్ 11: ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, ఎరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్.

పాకిస్థాన్ అండర్-19 ప్రాబబుల్ ప్లేయింగ్ 11: ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, షాజేబ్ ఖాన్-I, సాద్ బేగ్ (వికెట్ కీపర్), ఫర్హాన్ యూసుఫ్ (కెప్టెన్), ఫహమ్ ఉల్ హక్, మొహమ్మద్ రియాజుల్లా, మొహమ్మద్ తయ్యబ్ ఆరిఫ్, హరూన్ అర్షద్, అలీ రజా, అబ్దుల్ సుభాన్.

Read more Photos on
click me!

Recommended Stories