బుమ్రా వచ్చేస్తున్నాడు.. మహమ్మద్ సిరాజ్ అవుట్?
జ్వరం కారణంగా అమెరికా మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. నమీబియాతో జరిగే పోరులో అతను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బుమ్రా జట్టులోకి వస్తే ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాపై 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన మహమ్మద్ సిరాజ్ లేదా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం సిరాజ్‌నే తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నమీబియాతో తలపడే భారత అంచనా తుది జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.