Ind vs Pak : భారత్ అంటే అంత భయమా? కొలంబోలో రసవత్తర పోరు.. పాక్ అసలు గుట్టు ఇదే

Published : Feb 09, 2026, 04:25 PM IST

India vs Pakistan : టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ విస్మయం వ్యక్తం చేశారు. శ్రీలంకలో ఆడుతూ భారత్‌తో ఎందుకు ఆడరని ప్రశ్నించారు. భారత్ తో ఆడకపోతే పాక్ పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోనుందని సమాచారం.

PREV
16
టీ20 ప్రపంచకప్ 2026 : పాకిస్థాన్‌పై సౌరవ్ గంగూలీ ఫైర్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన గంగూలీ, పాక్ వైఖరి పట్ల తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అసలు ప్రపంచకప్‌లో ఒక కీలక మ్యాచ్‌ను ఎందుకు వదులుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

26
పాయింట్లు ముఖ్యం కాదా? గంగూలీ సూటి ప్రశ్న

పాకిస్థాన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. "వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం దేనికోసం? వారు ఎలాగూ శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడుతున్నారు కదా. పాకిస్థాన్ ఇలా వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. ఒక్క పాయింట్ తేడాతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అటువంటిది భారత్‌తో మ్యాచ్ ఆడమని చెప్పడం విడ్డూరంగా ఉంది" అని గంగూలీ పేర్కొన్నారు.

36
బంగ్లాదేశ్‌కు సపోర్టుగా పాక్ బాయ్‌కాట్

ఈ వివాదం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో, ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయానికి నిరసనగా, బంగ్లాదేశ్‌కు సపోర్టు తెలుపుతూ భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే టోర్నీలోని ఇతర మ్యాచ్‌లను పాక్ ఆడుతుండటం, కేవలం భారత్‌తో మ్యాచ్‌కే నిరాకరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

46
సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారంటే?

మరోవైపు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంలో తమ స్టాండ్‌ను స్పష్టం చేశారు. కొలంబోలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "మా మైండ్‌సెట్ చాలా క్లియర్ గా ఉంది. మేము ఆడతాం. మా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి, మేము వెళ్తున్నాం. మిగిలిన విషయాలు వారి ఇష్టం. వారి నిర్ణయం మా చేతుల్లో లేదు. మేము ఆసియా కప్ (2025) ఆడాము. ఫిబ్రవరి 15న మ్యాచ్ ఉందని మాకు స్పష్టమైన సమాచారం ఉంది" అని తెలిపారు.

56
షాహిద్ అఫ్రిది విచారం.. కానీ ప్రభుత్వానికే సపోర్టు

పాకిస్థాన్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఈ పరిణామాలపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. "రాజకీయాలు తలుపులు మూసివేసినప్పుడు క్రీడలు తలుపులు తెరుస్తాయని నేను నమ్ముతాను. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం. కానీ నా ప్రభుత్వ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను" అని ఎక్స్ లో పేర్కొన్నారు. అయితే గతంలో క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని చెప్పిన అఫ్రిది, ఇప్పుడు ప్రభుత్వ జోక్యాన్ని సమర్థించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

66
టీ20 ప్రపంచ కప్ లో మొత్తం 20 జట్లు

టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలలో జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా గ్రూప్-Aలో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా, పాకిస్థాన్‌లతో కలిసి ఉంది.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మహమ్మద్ నాఫే, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్.

Read more Photos on
click me!

Recommended Stories