ఆస్ట్రేలియాతో 4వ టీ20.. తెలుగోడి ఆగమనం.. గంభీర్ శిష్యుడికి మళ్లీ వెన్నుపోటే..

Published : Nov 05, 2025, 05:27 PM IST

Nitish Kumar Reddy: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20 మ్యాచ్ ఉత్కంఠగా మారనుంది. ఈ మ్యాచ్‌లో తెలుగు యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. నితీష్ రీఎంట్రీతో శివమ్ దూబే బెంచ్‌కే పరిమితమయ్యే ఆవకాశం ఉంది.

PREV
15
సిరీస్ గెలవాలని ఆలోచన..

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ గోల్డ్ కోస్ట్‌లో జరగనుంది. తొలి మూడు మ్యాచ్‌లతో సిరీస్ 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లకు.. ఈ నాలుగో టీ20 కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో లీడ్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. గత మ్యాచ్‌లో విజయం సాధించిన జోష్‌ను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

25
తెలుగోడి ఆగమనం..

తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గాయం కారణంగా సిడ్నీలో జరిగిన మూడో వన్డేతో పాటు తొలి మూడు టీ20లకు నితీష్ దూరమయ్యాడు. ఇప్పుడు నాలుగో టీ20లో నితీష్ కుమార్ రెడ్డి ఆడితే శివమ్ దూబే బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. 2026 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేస్తోంది.

35
బౌలింగ్‌లో లోపాలు..

బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించి ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. దీంతో నాలుగో మ్యాచ్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కకపోవచ్చని అంచనా. గత మ్యాచ్‌లో సంజు శాంసన్‌ను పక్కన పెట్టి జితేష్ కుమార్‌కు అవకాశం ఇవ్వగా, నాలుగో మ్యాచ్‌లో కూడా జితేష్ కుమార్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అర్షదీప్ సింగ్ కూడా జట్టులో చోటు మరోసారి దక్కించుకున్నాడు.

45
బ్యాటింగ్‌లో నో చేంజ్స్

బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఉన్నప్పటికీ, యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. భారత్‌కు శుభారంభాలు అందించడంలో విఫలమవుతున్న శుభ్ మన్ గిల్, ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా రాణించాలని నిపుణులు చెబుతున్నారు.

55
కెప్టెన్‌పైనే ఆశలన్నీ

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిలకడగా ఆడలేకపోతుండటం టీమ్ మేనేజ్‌మెంట్‌ను టెన్షన్ పెట్టిస్తోంది. తిలక్ వర్మపై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాకు నాలుగో టీ20లో షాక్ తప్పదనే కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. అందుకే నాలుగో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌కు సంబంధించి ఎలాంటి టెన్షన్ ఉండదని చర్చ జరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories