విరాట్ అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్ అని చెప్పడంలో సందేహం లేదు. 305 వన్డేల్లో, అతను 57.71 సగటుతో 14,255 పరుగులు చేశాడు, 51 సెంచరీలతో టాప్ లో నిలిచాడు. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అలాగే, 75 హాఫ్ సెంచరీలు సాధించాడు. 183 పరుగులు అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు.
నిజంగానే కోహ్లీ ఛేజ్‌మాస్టర్.. ఎందుకంటే వన్డేల్లో విజయవంతమైన పరుగుల వేటలో, విరాట్ అత్యధిక పరుగులు, సెంచరీల రికార్డును కలిగి ఉన్నాడు, 108 మ్యాచ్‌ల్లో 89.29 సగటుతో 6,072 పరుగులు చేశాడు, ఇందులో 24 సెంచరీలు ఉన్నాయి.
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000, 13,000, 14,000 పరుగుల మైలురాళ్లను చేరుకున్న ఆటగాడిగా అతను నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో కోహ్లీ రెండవ అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్. 37 మ్యాచ్‌ల్లో 59.83 సగటుతో 1,795 పరుగులు చేశాడు, ఇందులో ఐదు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.