భారత్‌ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?

Published : Oct 28, 2025, 03:46 PM IST

India vs Australia : భారత్‌-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ బుధవారం కాన్‌బెర్రాలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఏ టైమ్ కు ప్రారంభం అవుతుంది? ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం ఫ్రీగా చూడొచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
భారత్‌-ఆస్ట్రేలియా టీ20 సిరీస్

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమవుతోంది. ఈ సిరీస్‌లో తొలి పోరు అక్టోబర్ 29న కాన్‌బెర్రాలో మానుకా ఓవల్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం 1:45 గంటలకు ప్రారంభం కానుంది.

టీ20 వరల్డ్‌కప్‌ ముందు కీలక పోటీ

2026 ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ దిశగా భారత జట్టు తన సన్నాహకాలను కొనసాగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌ నేతృత్వంలోని భారత జట్టు ఆసియా కప్ 2025లో అజేయంగా విజయం సాధించిన తర్వాత మళ్లీ ఫుల్ ఫామ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లను ఓడించిన భారత్‌ ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్‌ల సవాలుకు సిద్ధమవుతోంది.

25
భారత్ జట్టులో మార్పులు, కీలక ఆటగాళ్లు

భారత్ జట్టులో ప్రధాన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి బ్యాకప్‌గా ఉన్నా, అతని అందుబాటుపై సందేహాలున్నాయి. యువ ఆటగాళ్లైన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్‌ల ప్రదర్శనపై ప్రధాన దృష్టి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌ బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తారు.

భారత్‌ జట్టు

సూర్యకుమార్ యాదవ్‌ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్‌ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

35
ఆస్ట్రేలియా జట్టులో సవాళ్లు

ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్‌ కెప్టెన్ గా ఉన్నాడు. ప్యాట్ కమిన్స్‌, మిచెల్ స్టార్క్‌ లేకపోవడం బౌలింగ్ విభాగానికి దెబ్బ. జోష్ హేజిల్ వుడ్, ఆడమ్ జంపాలపై ప్రధాన బాధ్యత ఉంటుంది. బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్‌, టిమ్ డేవిడ్‌, మార్కస్ స్టాయినిస్‌ కీలకం కానున్నారు.

ఆస్ట్రేలియా జట్టు 

మిచెల్ మార్ష్‌ (కెప్టెన్), ట్రావిస్ హెడ్‌, జోష్ ఇంగ్లిస్‌, మాథ్యూ షార్ట్‌, టిమ్ డేవిడ్‌, మిచెల్ ఓవెన్‌, మార్కస్ స్టాయినిస్‌, జావియర్ బార్ట్‌లెట్‌, నాథన్ ఎలిస్‌, జోష్ హేజిల్ వుడ్, సంగ.

45
భారత్ vs ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ తేదీ, సమయం, ప్రసారం వివరాలు

భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ అక్టోబర్ 29 బుధవారం మానుకా ఓవల్‌ లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 IST మొదలవుతుంది. మధ్యాహ్నం 1:15 IST గంటలకు టాస్ పడుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే,జియో హాట్‌స్టార్ యాప్‌, వెబ్‌సైట్ లలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

55
భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్

1వ మ్యాచ్: అక్టోబర్ 29 – మానుకా ఓవల్‌, కాన్‌బెర్రా

2వ మ్యాచ్: అక్టోబర్ 31 – MCG, మెల్బోర్న్

3వ మ్యాచ్: నవంబర్ 2 – బెల్లరివ్ ఓవల్‌, హోబార్ట్

4వ మ్యాచ్: నవంబర్ 6 – గోల్డ్ కోస్ట్ స్టేడియం

5వ మ్యాచ్: నవంబర్ 8 – ది గబ్బా, బ్రిస్బేన్

Read more Photos on
click me!

Recommended Stories