Team India : సూర్యకు షాక్.. కెప్టెన్ గా సంజూ శాంసన్.. యంగ్ ఇండియా రెడీ !

Published : Mar 22, 2026, 08:48 PM IST

Team India : దాదాపు 19 ఏళ్ల తర్వాత బెల్ఫాస్ట్‌లో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. జూన్ 26 నుండి ప్రారంభం కానున్న ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు సంజూ శాంసన్ సారథ్యం వహింనున్నాడని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఐర్లాండ్‌లో భారత్ టీ20 గర్జన.. కొత్త కెప్టెన్‌గా సంజూ?

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తర్వాత, టీమిండియా తన మొదటి టీ20 సిరీస్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ను బోర్డు అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత అంటే దాదాపు 19 ఏళ్ల విరామం అనంతరం బెల్ఫాస్ట్ లో భారత్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం విశేషం.

26
బెల్ఫాస్ట్ లో చరిత్రాత్మక సిరీస్

బీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత సీనియర్ పురుషుల జట్టు జూన్ 2026లో ఐర్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. గత ఎనిమిదేళ్లలో భారత్ మూడుసార్లు (2018, 2022, 2023) ఐర్లాండ్‌ను సందర్శించినప్పటికీ, అవన్నీ డబ్లిన్ సమీపంలోని మలాహిడేలో జరిగాయి. కానీ 2007 తర్వాత మొదటిసారిగా బెల్ఫాస్ట్‌లో భారత్ అడుగుపెడుతోంది. జూన్ 26న మొదటి టీ20, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

36
సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు?

ఈ పర్యటనలో టీమిండియా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఐర్లాండ్ వంటి జట్లపై ఆడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో సంజూ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు తన అనుభవంతో జట్టును ముందుండి నడిపించే ఛాన్స్ ఆయనకు దక్కవచ్చు. అభిషేక్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా వైభవ్ సూర్యవంశీలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.

46
బిజీ షెడ్యూల్‌లో టీమిండియా

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు బిజీ కానుంది. తొలుత అఫ్గానిస్థాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. జూన్ 20న అఫ్గాన్ సిరీస్ ముగియగానే, వెంటనే ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు ముగించుకున్నాక, జూలై 1 నుండి 19 వరకు ఇంగ్లాండ్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ పాల్గొంటుంది. అంటే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ సిరీస్ ఒక మంచి సన్నాహకంగా మారనుంది.

56
ఐర్లాండ్ జట్టులో కీలక మార్పులు

మరోవైపు ఐర్లాండ్ క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ జట్టు స్టార్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ టీ20 కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ గ్రాహం వెస్ట్ మాట్లాడుతూ.. కొత్త కెప్టెన్ తనదైన శైలిని అమలు చేయడానికి భారత్‌తో జరిగే సిరీస్ ఒక గొప్ప అవకాశంగా అవుతుందని పేర్కొన్నారు. స్టిర్లింగ్ వన్డే కెప్టెన్‌గా కొనసాగుతూ, కేవలం ప్లేయర్‌గా టీ20ల్లో అందుబాటులో ఉంటాడు.

66
ఇండియా vs ఐర్లాండ్: మ్యాచ్ షెడ్యూల్ ఇదే

భారత్, ఐర్లాండ్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:

• మొదటి టీ20: జూన్ 26, శుక్రవారం (రాత్రి 7:30 గంటలకు)

• రెండో టీ20: జూన్ 28, ఆదివారం (రాత్రి 7:30 గంటలకు)

వరల్డ్ ఛాంపియన్స్ హోదాలో భారత్ బరిలోకి దిగుతుండటంతో ఈ సిరీస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. యువ రక్తంతో నిండిన టీమిండియా ఐర్లాండ్‌ను వారి స్వదేశంలో ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories