Ishan Kishan : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఇషాన్ కిషన్ (54) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ చేరాడు.
అహ్మదాబాద్ స్టేడియంలో ఇషాన్ కిషన్ ఊచకోత! టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇషాన్ కిషన్ శివతాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సిక్సర్ల వర్షం కురిపిస్తూ, కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇది కేవలం హాఫ్ సెంచరీ కాదు... టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన ఇన్నింగ్స్..
అభిషేక్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, ఏమాత్రం తడబడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో వరుస ఫోర్లతో తన ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇషాన్, స్టేడియంలో ఉన్న అభిమానులను ఉర్రూతలూగించాడు. కివీస్ బౌలర్లు అతన్ని కట్టడి చేసేందుకు వేసిన ప్లాన్లన్నీ ఇషాన్ దెబ్బకు తలకిందులయ్యాయి.
25
లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో విధ్వంసం
న్యూజిలాండ్ స్పీడ్ గన్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఆడిన షాట్లు ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఫెర్గూసన్ వేసిన షార్ట్ బాల్స్‌ను ఇషాన్ కళ్లు చెదిరే సిక్సర్లుగా మలిచాడు. ఫెర్గూసన్ తన రెండు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకోవడానికి ఇషాన్ కిషన్ మెరుపు దాడే ప్రధాన కారణం. ముఖ్యంగా లాంగ్-ఆన్ మీదుగా అతను కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే ప్రత్యేకం.
35
ఇషాన్ మెరుపు అర్ధసెంచరీ.. కివీస్ మైండ్ బ్లాక్
ఇషాన్ కిషన్ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో అద్భుతమైన షాట్‌తో యాభై మార్కును దాటిన ఇషాన్, ఆకాశం వైపు చూస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సంజూ శాంసన్ తో కలిసి ఇషాన్ చేసిన విధ్వంసం వల్ల భారత్ స్కోరు బోర్డు 12.75 రన్ రేట్‌తో దూసుకుపోయింది.
ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. తాజా ఇన్నింగ్స్‌తో ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కూడా చేరిపోయాడు. ఈ లిస్టులో పాక్ ప్లేయర్ టాప్ లో ఉన్నాడు. సంజూ మూడో స్థానంలో ఉన్నాడు.
• సాహిబ్జాదా ఫర్హాన్ (2026): 383 పరుగులు
• టిమ్ సీఫెర్ట్ (2026): 326 పరుగులు
• సంజూ శాంసన్ (2026): 321 పరుగులు
• విరాట్ కోహ్లీ (2014): 319 పరుగులు
• తిలకరత్నే దిల్షాన్ (2009): 317 పరుగులు
• ఇషాన్ కిషన్ (2026): 317 పరుగులు
55
చివర్లో అవుటైనా భారత్‌కు భారీ స్కోరు
జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో మార్క్ చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే సమయానికి ఇషాన్ కిషన్ భారత్‌ను సురక్షితమైన స్థితిలో నిలిపాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి అతను పెవిలియన్ చేరాడు. ఇషాన్ అవుటైనప్పటికీ, అతను అందించిన మెరుపు ఆరంభంతో టీమిండియా 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగింది. ఆ తర్వాత బౌలింగ్ తో కూడా న్యూజిలాండ్ ను దెబ్బకొట్టింది.