ICC T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్‌ను రెండుసార్లు గెలిచిన జట్లు కేవలం మూడంటే మూడు.. ఈ రెండుసార్లు టీంలో ఆడిన ఆటగాళ్లు చాలా అరుదు. ఇలాంటి రికార్డు టీమిండియా ప్లేయర్ సొంతం. అది మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీయో కాదు... మరి ఎవరు..?
T20 World Cup : ప్రస్తుతం భారత్, శ్రీలంక ఆతిథ్యంలో ఐసిసి టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఇప్పటికే ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే విజయయాత్రను చివరివరకు కొనసాగించి మరో టీ20 వరల్డ్ కప్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇదే జరిగితే టీమిండియా ఖాతాలో మూడో ట్రోఫీ చేరుతుంది... ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా నిలుస్తుంది.
అయితే ఇప్పటివరకు రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్లు మూడంటే మూడు మాత్రమే. ఇలా రెండుసార్లు విన్నింగ్ టీంలో ఆడిన క్రికెటర్లు కొందరు ఉన్నారు. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఒకరు. మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఈ ఘనత సాధించారు. వీరిగురించి ఇక్కడ తెలుసుకుందాం.
25
1. రోహిత్ శర్మ (Rohit Sharma)
టీమిండియా 2007లో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్ విజేత. అలాగే గత సీజన్ విజేత కూడా ఇండియానే. ఈ రెండు జట్లలో రోహిత్ శర్మ భాగస్వామి... అయితే 2007 లో ఓ సాధారణ ఆటగాడు... కానీ 2024 లో కెప్టెన్ గా టీంను ముందుండి నడిపిన విజేత.
రోహిత్ శర్మ 2007 నుంచి 2024 వరకు జరిగిన ప్రతీ టీ20 ప్రపంచ కప్‌లో ఆడాడు. 2007లో యువ ఆటగాడిగా దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ లపై కీలకమైన నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2024లో కెప్టెన్‌గా జట్టును గెలిపించాడు... ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌లలో 156.70 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. ఇలా రోహిత్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచాడు.
35
2. డ్వెన్ బ్రావో (Dwayne Bravo)
వెస్టిండీస్ రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచింది... ఈ విజయాల్లో డ్వేన్ బ్రావో ఆల్‌రౌండ్ నైపుణ్యాలు చాలా కీలకం. 2012లో అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు చేశాడు... 2016లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో 3-37 ప్రదర్శనతో బెన్ స్టోక్స్, మొయిన్ అలీ వంటి కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. బ్యాట్, బంతితో బ్రావో ప్రదర్శన వెస్టిండిస్ టీంను రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలపడంతో ఎంతగానో ఉపయోగపడింది.
వెస్టిండిస్ జట్టు 2012 ప్రపంచ కప్ గెలవడంలో క్రిస్ గేల్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో మూడు అర్ధశతకాలతో 222 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో 75* పరుగులు సాధించాడు.ఇక 2016లో ముంబైలో ఇంగ్లండ్‌పై కేవలం 48 బంతుల్లో 100* పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ రెండు టోర్నీల్లో అతని పవర్ హిట్టింగ్ జట్టు విజయానికి కారణమైంది.
55
4. మార్లోన్ శ్యామూల్స్ (Marlon Samuels)
మార్లోన్ శామ్యూల్స్ 2012, 2016 రెండు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్' గా నిలిచాడు. 2012లో కొలంబోలో శ్రీలంకపై 56 బంతుల్లో 78 పరుగులు చేసి, బౌలింగ్‌లోనూ రాణించాడు. నాలుగేళ్ల తర్వాత కోల్‌కతాలో ఇంగ్లండ్‌పై 66 బంతుల్లో 85* పరుగులు చేసి వెస్టిండీస్‌ను గెలిపించాడు. రెండు ఫైనల్స్‌లో అతని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు చిరస్మరణీయం.