బౌలింగ్ దళం.. పిచ్ అంచనాలు ఇవే
చెన్నై పిచ్ సాంప్రదాయకంగా స్పిన్నర్లకు స్వర్గధామం. వరుణ్ చక్రవర్తికి ఇది హోమ్ గ్రౌండ్ కావడం విశేషం. వరుణ్, కుల్దీప్, అక్షర్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లతో జింబాబ్వేను దెబ్బకొట్టాలని భారత్ ప్లాన్ చేస్తోంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద ఊరట. గత మ్యాచ్‌లో ఇతర బౌలర్లు విఫలమైనా బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడానికి భారీ విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
జింబాబ్వే తో ఫైట్.. భారత ప్రాబబుల్ ఎలెవన్
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.