MS Dhoni Swapnil Kusale
Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ 2014లో పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే మెడల్ సాధించాడు. భారత్ కు మూడో మెడల్ అందించిన ఈ షూటర్.. ఈ విభాగంలో ఫైనల్ కు చేరుకుని చరిత్ర సృష్టించారు. అలాగే, మెడల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. అయితే, ఒలింపిక్ మెడల్ గెలిచిన స్వాప్నిల్ కుసాల్ కు, భారత ఛాంపియన్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. స్వప్నిల్ కూడా క్రీడల విషయంలో ధోనిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఒలింపిక్స్ లో మెడల్ సాధించాడు.
ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి భారతీయ షూటర్ అయిన స్వప్నిల్ కుసాల్.. ఎంఎస్ ధోని నుండి ప్రేరణ పొందాడు. ఎందుకంటే అతను కూడా క్రికెట్ ఐకాన్ ధోని లాగే తన కెరీర్ ప్రారంభంలో రైల్వే టిక్కెట్ కలెక్టర్‌గా ఉన్నాడు. అవును.. ధోని భారత క్రికెట్ కు నాయకత్వం వహించకముందు టిక్కెట్ కలెక్టర్ గా ఉన్నాడు. అలాగే, స్వప్నిల్ కూడా టిక్కెట్ కలెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత 2012 నుండి అంతర్జాతీయ ఈవెంట్‌లలో పోటీపడుతున్నాడు.
అయితే పారిస్ గేమ్స్‌లో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయడానికి కుసాల్ 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. షూటర్‌కు ప్రశాంత, ఓపికగా ఉండటం కీలకం. ఆ రెండు లక్షణాలు కూడా ధోని వ్యక్తిత్వానికి ముఖ్య లక్షణంగా మనం చూశాము. అందేకే ధోనిని కెప్టెన్ కూల్ గా పిలుచుకుంటారు. ఎలాంటి ఒత్తిడి సమయంలోనైనా ధోని కూల్ గా ఉంటూ జట్టుకు అనేక విజయాలను అందించారు. ఇప్పుడు ధోని మాదిరిగానే స్వప్నిల్ కుసాలే పారిస్ ఒలింపిక్స్ లో ఒత్తిడికి గురికాకుండా, కూల్ గా ఉంటూ మెడల్ సాధించాడు.
స్వాప్నిల్ కుసాల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. "నేను షూటింగ్ ప్రపంచంలో ఎవరినీ ప్రత్యేకంగా అనుసరించను. కానీ, షూటింగ్ తో సంబంధం లేకుండా ధోనీని నేను ఆరాధిస్తాను. అతను మైదానంలో ఉన్నంత ప్రశాంతంగా.. ఓపికగా ఉండటం నా క్రీడకు అవసరం. నేను అతని కథతో కూడా సంబంధం కలిగి ఉన్నాను. నేను అతనిలాగే టిక్కెట్ కలెక్టర్‌ని" అని కుసాలే తెలిపారు. కుసాలే 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నారు.
Dhoni Swapnil
అలాగే, "ప్రతి షాట్ కొత్త షాట్. నేను ఓపికగా ఉండేందుకు ప్రయత్నించాను. మ్యాచ్ మొత్తం నాది అదే ఆలోచన. ఓపికతో షూట్ చేయడం. మనస్సు లో ప్రతిసారి టార్గెట్ ను గుర్తు చేసుకున్నాను. ప్రతిసారి స్కోర్ గురించి పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఇది చాలా గొప్ప అనుభవం. నాకు షూటింగ్ అంటే చాలా ఇష్టం, ఇంత కాలం చేయగలిగానన్నందుకు ఆనందంగా ఉంది. మను భాకర్ అద్భుత ప్రదర్శనతో మెడల్ గెలవడం చూసి మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆమె చేయగలిగితే మేం కూడా చేయగలం అనుకున్నాం.. సాధించాం" అని స్వప్నిల్ కుసాలే తెలిపాడు.