గ్రేట్ బ్రిటన్ పై అద్భుత పోరాటం.. సెమీస్ చేరిన భారత హాకీ జట్టు

First Published | Aug 4, 2024, 3:18 PM IST

Hockey Great Britain vs India : పారిస్ ఒలింపిక్స్ 2024 లో హాకీ క్వార్టర్‌ఫైనల్స్ భార‌త్-గ్రేట్ బ్రిట‌న్ మ్యాచ్ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగింది. షూటౌట్ లో భార‌త్ అద్భుతంగా గోల్స్ చేసి సెమీస్ చేరుకుంది.
 

Hockey Great Britain vs India :  పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త హాకీ జ‌ట్టు గ్రూప్ ద‌శ‌లో ఒక్క మ్యాచ్ మాత్ర‌మే ఓడిపోయి క్వార్ట‌ర్ ఫైన‌ల్ కు చేరుకుంది. క్వార్ట‌ర్ ఫైన‌ల్ భార‌త్-గ్రేట్ బ్రిట‌న్ లు త‌ల‌ప‌డ్డాయి. చివరి హాఫ్ లో భారత్ 10 మంది ప్లేయర్లతోనే డిఫెండ్ చేసుకోవడం విశేషం. 

ఇరు జ‌ట్లు గెలుపు కోసం అద్భుతమైన ఆట‌తో పోరాడాయి. భార‌త ప్లేయ‌ర్ శ్రీజేష్ ఏకంగా బ్రిట‌న్ ఆడిన 11 షాట్స్ లో 10 షాట్స్ ను ఆప‌డం విశేషం. నిర్ణీత 60 నిమిషాల పాటు భారత్, గ్రేట్ బ్రిటన్ అద్భుత పోరాటంతో 1-1తో సమంగా నిలిచాయి. దీంతో విజేత‌ను నిర్ణ‌యించ‌డానికి మ్యాచ్ షూటౌట్ కు చేరుకుంది.


Indian Hockey Team

షూటౌట్ లో గ్రేట్ బ్రిటన్ తొలి  గోల్ చేసింది. ఆ తర్వాత భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోల్ చేసి మళ్లీ సమం చేశాడు. మరోసారి శ్రీజేష్ అడ్డుకోవడంలో విఫలం కావడంతో బ్రిటన్ రెండో గోల్ చేసింది. ఇప్పుడు భారత్ వంతు.. !

hockey

భారత్ రెండో షూటౌట్ లో సుర్జీత్ కూడా గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు రెండేసి గోల్స్ తో సమంగా ఉన్నాయి. మూడో గోల్ షూటౌట్ లో గ్రేట్ బ్రిటన్ మిస్ చేసింది. భారత్ తరఫున లలిత్ ప్రదీప్ భారత్ కు మూడో గోల్ ను అందించాడు. దీంతో భారత్ 3-2 తో లీడ్ లోకి వచ్చింది.  ఆ తర్వాత కూడా మరో గోల్ చేసి భారత్  4-2 విజయాన్ని అందుకుంది. 

Latest Videos

click me!