Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు తొలి మెడల్ ను అందించి షూటర్ మను భాకర్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. హర్యానాకు చెందిన ఈ యంగ్ షూటర్ ఒకటి కాదు ఏకంగా రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది. మూడో పతకాన్ని పాయింట్ దూరంలో మిస్సయ్యారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో మను భాకర్ మొదట బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒకే సీజన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా మను రికార్డు సృష్టించింది.
ఈ క్రమంలోనే మను భాకర్ ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలవడంలో కీలకంగా పనిచేసిన పిస్టల్ గురించి చర్చ సాగుతోంది. దాని ధర, ఇతర ప్రత్యేకతలు గమనిస్తే.. మను భాకర్ ఒలింపిక్స్ లో ఉపయోగించిన పిస్టల్ మోరిని కంపెనీది.
Paris Olympics 2024 - Manu Bhaker Sarabjot Singh2
పారిస్ ఒలింపిక్స్ 2024లో MORINI కంపెనీకి చెందిన CM 162EIతో మను భాకర్ షూటింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారు. ఈ పిస్టల్ తోనే మను భాకర్ రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించారు. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు కూడా చేరుకుంది.
మనుభాకర్ ఉపయోగించిన పిస్టల్ కు ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి వుంటుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా భారత షూటర్లు ఈ పిస్టల్‌ను పొందలేరు. కేవలం షూటర్ల మాత్రమే కాదు ప్రభుత్వ ఆమోదం లేకుండా భారతీయులెవరూ కొనలేరు, అమ్మలేరు.
Manu Bhaker 03
మోరిని కంపెనీకి చెందిన పిస్టల్‌ను మను భాకర్ ఉపయోగించడానికి ఆమెకు లైసెన్స్ ఉంది. ఏదైనా భారతీయ అథ్లెట్ ఒలింపిక్స్ లేదా ఏదైనా అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొంటే, అతనికి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) లేదా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తుపాకీని అందజేస్తుంది.
Manu Bhaker
10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో ఉపయోగించే పిస్టల్ 4.5 మిమీ క్యాలిబర్, సింగిల్ లోడ్ చేయబడింది. చాలా మంది షూటర్లు ఈ ఈవెంట్ కోసం మోరిని కంపెనీకి చెందిన CM 162EI మోడల్ పిస్టల్‌ను ఉపయోగిస్తున్నారు.
మోరిని CM 162EI మోడల్ పిస్టల్ తోనే మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. ఈ పిస్టల్ దీని ధర రూ.166900. మోడల్ ఆధారంగా ఈ ధరలు మారుతుంటాయి. అయితే ఈ పిస్టల్ కొనాలంటే పేపర్ వర్క్ చాలానే చేయాల్సి ఉంటుంది.