Yusuf Dikec
"ఎవడైనా కోపంగా కొడతాడు, లేపోతే బలంగా కొడతాడు. వీడెంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు.. ఏదో ఒక గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్టు.. చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జి"...అతడు సినిమాలో ఉన్న ఈ డైలాగ్ పారిస్ ఒలింపిక్స్ లో 10మీ మిక్స్డ్ డబుల్స్ షూటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన టర్కీకి చెందిన డికెక్ యూసుఫ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
Yusuf Dikec
షూటింగ్ చేసే క్రీడాకారులు ధరించే స్పెషల్ గేర్, కళ్ళద్దాలు ధరించకుండా జీన్స్, టీషర్ట్, కళ్ళకు రెగ్యులర్ కళ్ళజోడు ధరించి క్యాజువల్ గా వచ్చి ఒకచేయి జేబులో పెట్టుకొని మరీ జస్ట్ అలా షూట్ చేసి సిల్వర్ మెడల్ కొట్టేశాడు..
Yusuf Dikec
అయితే కొన్నాళ్ళ క్రితం డికెక్ భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు.. కనీసం తన పిల్లలను చూడడానికి కూడా అతడి భార్య అనుమతించలేదు. విడాకుల కారణంగా ఏర్పడిన మానసిక వేదనను అధిగమించేందుకు షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు..
జీవితంలో జరిగిన నెగిటివ్ సంఘటన ద్వారా ఏర్పడిన కసి, పట్టుదల అనే భావోద్వేగాలను పాజిటివ్ గా ఒక లక్ష్యం వైపు మళ్ళించి విజయం సాధించవచ్చు... ఆలోచన మారితే జీవితం మారుతుంది....అని ఇప్పుడు ఈ ఒలింపిక్ రజత పతక విజేత నిరూపించాడు. ఆ రకంగా అతడి విజయం వెనక పరోక్షంగా ఉన్నది ఆవిడే..
ఇదీ ఒలింపిక్ పతక విజేత యూసఫ్ డికేక్ గురించి ఓ నెటిజన్ ఫేస్ బుక్ లో రాసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ స్టోరీ.
అయితే ఇది వాస్తవం కాదని.. అతని భార్య తాలూకు వివరాలన్నీ కేవలం ప్రచారమేనని పలు మీడియా సంస్థలు చేసిన ఫ్యాక్ట్ చెక్స్‌లో తేలింది.