గత నెల నుంచి హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ తరచూ చాలా కార్యక్రమాల్లో కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో పరస్పరం ఇంటరాక్షన్స్ చేయడం వల్ల వారి మధ్య డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్ ప్రాక్టీస్ ఫోటోలతో పాటు తన కుమారుడు అగస్త్యతో ఉన్న చిత్రాలు, అలాగే మహీకాతో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
అదే రోజు హార్దిక్ స్టోరీల్లో మరిన్ని వివరాలు వెల్లడించాడు. హార్దిక్, మహీకా ఇద్దరూ హనుమాన్ పూజా నిర్వహించినట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో కూడా మహీక రింగ్ ధరించి కనిపించడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది.
ఒక సోషల్ మీడియా యూజర్ ఆ ఫోటో స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేయడంతో పోస్ట్ మరింత వైరల్ అయ్యింది. కొందరు వినియోగదారులు “ఇదిగో, నిశ్చితార్థం అయిపోయింది” అని అంటుండగా, మరికొందరు “ఇంత త్వరగా హార్దిక్ మళ్లీ ఎంగేజ్ అవడని అనుకోవడం కష్టం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ “వాళ్లు సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది”, మరో యూజర్ “ఇది నిశ్చితార్థం రింగ్‌లానే ఉంది.” అంటూ ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.