
మన దేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్. కాలం మారిన కొద్దీ మన దేశానికి ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్ళు దొరికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు మనందరి గుండెల్లో నిలిచారు.
కానీ ఇప్పుడు టైం మారింది. క్రికెట్ ప్రపంచాన్ని ఇప్పుడు జెన్ జీలు టేకోవర్ చేసేసారు. ప్రతి రంగంలోనూ సత్తా చాటుతున్న ఈ జనరేషన్, క్రికెట్ పిచ్ మీద కూడా దుమ్ము లేపుతోంది. ఇప్పడు మన ఇండియన్ క్రికెట్లో జెన్ జీ ప్లేయర్లదే హవా.
వన్డేలు, టెస్టుల్లో మన జాతీయ జట్టును లీడ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ నుంచి, అతి చిన్న వయసులోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ దాకా అంతా ఈ జనరేషనే. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ కూడా ఇదే జాబితాలో టాప్‌లో ఉన్నారు.
ఈ జెన్ జీ క్రికెటర్ల లిస్టులో ముందుండే పేరు శుభ్‌మన్ గిల్. ఈయన వయసు 27 సంవత్సరాలు. పంజాబ్ లోని ఫాజిల్కాలో పుట్టారు. ఇంత చిన్న వయసులోనే టీమిండియాను లీడ్ చేయడం మామూలు విషయం కాదు. శుభ్‌మన్ ప్రస్తుతం టెస్టులు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
అయితే టీ20 ఇంటర్నేషనల్స్‌లో మాత్రం ఆయన కెప్టెన్ కాదు. ఈయనను అందరూ ముద్దుగా 'ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్' అంటారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కూడా ఇతనే కెప్టెన్.
ఆస్తుల విషయానికి వస్తే, శుభ్‌మన్ గిల్ అంచనా నెట్‌వర్త్ 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల మధ్య ఉంది. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ జీతం, అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఈయన భారీగా ఆర్జిస్తున్నారు.
జెన్ జీ స్టార్లలో యశస్వి జైస్వాల్ పేరు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈయన వయసు 24 ఏళ్ళు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లా ఈయన సొంతూరు. టీమిండియాలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగే యశస్వి, తన దూకుడుతో కూడిన బ్యాటింగ్‌కు ఫేమస్.
ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి యశస్వి పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు, ఆయన ప్రయాణం ఎన్నో పోరాటాలతో సాగింది. ఐపీఎల్లో ఈ యువ కిషోర్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆడుతున్నారు.
2026 నాటికి యశస్వి జైస్వాల్ అంచనా నెట్‌వర్త్ సుమారు 55 కోట్ల రూపాయలుగా ఉంది. 'ది స్పోర్ట్స్ లెజెండ్' సంస్థ ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ అంచనా సంపాదన ఇది.
ఈ జాబితాలో మూడో పేరు అభిషేక్ శర్మది. ఈయన వయసు 26 సంవత్సరాలు. గతంలో భారత్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆడారు. అభిషేక్ బ్యాటింగ్ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సిందే, అంతలా అభిమానులను ఆకట్టుకుంటారు.
అభిషేక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, అంతేకాదు మంచి ఆల్ రౌండర్ కూడా. టీమిండియా తరఫున ఓపెనర్‌గా వస్తుంటారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతూ మెరుపులు మెరిపిస్తున్నారు.
మీడియా రిపోర్ట్‌ల ప్రకారం అభిషేక్ శర్మ నికర ఆస్తుల విలువ సుమారు 12 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా.
జెన్ జీ క్రికెటర్లలో మరొకరు తిలక్ వర్మ. ఈయన వయసు 23 ఏళ్ళు. 2002 నవంబర్ 8న హైదరాబాద్, తెలంగాణలోనే జన్మించారు. తిలక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మనే కాకుండా, అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు.
ఈయన బ్యాటింగ్ స్టైల్ చాలా స్పెషల్. ఒత్తిడిలో కూడా క్రీజులో నిలదొక్కుకోవడం, ఛాన్స్ దొరికితే స్పీడ్‌గా పరుగులు తీయడం ఈయన స్పెషాలిటీ. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మీడియా అంచనాల ప్రకారం తిలక్ వర్మ నెట్‌వర్త్ సుమారు 20 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఇచ్చే సాలరీ, మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ల ద్వారా ఈయన సంపాదిస్తున్నారు.
జెన్ జీ స్టార్ల లిస్టులో వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. ఈ యంగ్ ప్లేయర్ వయసు కేవలం 15 ఏళ్లే. మార్చి 27, 2011న బీహార్‌లోని సమస్తిపూర్‌లో పుట్టారు. ఇంత చిన్న వయసులోనే తన అటాకింగ్ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
వైభవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. మైదానంలో పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టడంలో దిట్ట. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యంగ్ స్టార్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు.
మీడియా రిపోర్ట్‌ల ప్రకారం వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తుల విలువ దాదాపు 2.5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ జెన్ జీ క్రికెటర్లంతా తమ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకుని చాలా చిన్న వయసులోనే క్రికెట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. శుభ్‌మన్ కెప్టెన్సీ నుంచి యశస్వి దూకుడు, అభిషేక్ భారీ షాట్లు, తిలక్ కూర్పు, వైభవ్ ఊచకోత.. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఏంటో చూపిస్తున్నాయి.