IPL 2027 Auction: 4 ఏళ్ల తర్వాత ఇండియాకి ఐపీఎల్ ఆక్షన్.. గోవాలో వేలం తేదీ ఫిక్స్

Published : Oct 18, 2026, 01:45 PM IST

IPL 2027 Auction: 4 ఏళ్ల తర్వాత ఇండియాకి ఐపీఎల్ ఆక్షన్ తిరిగివచ్చింది. ఐపీఎల్ 2027 మినీ వేలంలో గోవాలో నిర్వహించనున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ఆ వివరాలు మీకోసం.

PREV
15
4 ఏళ్ల తర్వాత భారత్‌లో ఐపీఎల్ వేలం

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు ఇది నిజంగా క్రేజీ న్యూస్.. గత నాలుగేళ్లుగా విదేశీ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ ప్లేయర్ల వేలం మళ్లీ మన దేశానికి తిరిగి రానుంది. ఐపీఎల్ 2027 మినీ ఆక్షన్‌ను గోవాలోని ప్రఖ్యాత ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని బోర్డు ఇప్పటికే వాట్సాప్ ద్వారా మొత్తం 10 ఫ్రాంచైజీలకు అందించింది.

25
డిసెంబర్ 16న వేలం పాట

తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 16న ఈ మినీ వేలం జరగనుంది. దానికి ఒక్క రోజు ముందు, అంటే డిసెంబర్ 15న ఫ్రాంచైజీ ప్రతినిధులతో బీసీసీఐ అధికారిక బ్రిఫింగ్ సమావేశం ఏర్పాటు చేసింది. వేలానికి హాజరయ్యే ప్రతినిధుల సంఖ్యను ఖరారు చేయడం, గోవాలో హోటల్ బుకింగ్స్, ప్రయాణ ఏర్పాట్లు వేగవంతం చేయడం కోసమే బీసీసీఐ ఈ వివరాలను జట్లకు ముందుగానే పంపించింది.

35
నాలుగేళ్ల తర్వాత దేశంలోకి గ్రాండ్ ఎంట్రీ

గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆక్షన్‌ను గల్ఫ్ దేశాల్లోనే నిర్వహించారు. దుబాయ్, జెడ్డా, అబుదాబిలలో ఈ ఈవెంట్లు జరిగాయి. భారత్‌లోనే వేలం పెట్టాలని ప్రతిసారీ చూసినా, శీతాకాలంలో వచ్చే వివాహాల సీజన్ వల్ల మంచి వేదికలు దొరక్కపోవడంతోనే విదేశాలకు వేలం మారిందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ గతంలో వెల్లడించారు. అయితే ఈసారిది మినీ ఆక్షన్ కావడంతో, చిన్న సైజు వెన్యూ సరిపోతుందని భావించి గోవాను ఖరారు చేశారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ వేలం భారత్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు.

45
అదే రోజు ఇండియా-శ్రీలంక వన్డే మ్యాచ్

ఈ వేలం తేదీపై మరో ఆసక్తికర చర్చ మొదలైంది. డిసెంబర్ 16నే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకే రోజున మ్యాచ్, ఆక్షన్ రావడం వల్ల మ్యాచ్ షెడ్యూల్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది చూడాలి. మరోవైపు డిసెంబర్ 13న ఢిల్లీలో జరగాల్సిన సిరీస్ తొలి వన్డే వేదికను మార్చుతున్నట్లు వార్తలు వచ్చినా, బీసీసీఐ మాత్రం దాన్ని ఖండించింది.

55
నవంబర్ లోగా రిటైన్డ్ ప్లేయర్ల లిస్ట్

ఫ్రాంచైజీలు తమ జట్లలో ఉంచుకునే, వదిలేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్ మధ్య నాటికి బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బోర్డు అధికారిక పూల్‌ను సిద్ధం చేస్తుంది. మరోవైపు ట్రేడింగ్ ద్వారా భారీ మార్పులు జరిగాయి. రిషభ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ నుంచి మళ్లీ తన పాత టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరుకోగా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో వైపు అడుగులు వేస్తున్నాడు.

ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ డైరెక్ట్ ట్రేడ్ ద్వారా తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించగా, జీషాన్ అన్సారీ ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఈ మినీ ఆక్షన్‌తో జట్లన్నీ తమ ప్రధాన లోపాలను సరిదిద్దుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories