Abhishek Sharma Weakness: అభిషేక్ శర్మ సీక్రెట్ లీక్? విండీస్ బౌలర్లు పట్టిన వీక్ పాయింట్ ఇదే

Published : Oct 18, 2026, 02:15 PM IST

Abhishek Sharma Weakness: భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన షాట్లతో అంతర్జాతీయ టీ20ల్లో తనదైన ముద్ర వేసినప్పటికీ, ప్రత్యర్థి జట్లు అతని వికెట్ తీసేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి శర్మ వీక్ పాయింట్ బయటపడింది.

PREV
14
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? వరుసగా విఫలమవుతున్న టీమిండియా స్టార్

భారత తుఫాన్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్ట్రెయిట్ డెలివరీలను ఎదుర్కోవడంలో పదేపదే తడబడుతున్న తీరు బెంగళూరులో జరిగిన కీలక సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో మరోసారి బయటపడింది. వెస్టిండీస్ బౌలర్లు అతడి బలహీనతను టార్గెట్ చేస్తూ అవుట్ చేయడంతో, అభిషేక్ శర్మ బ్యాటింగ్ కన్సిస్టెన్సీపై మరోసారి చర్చ మొదలైంది.

ఈ కీలక పోరులో భారత్‌కు మంచి ఆరంభం ఇవ్వాల్సిన అభిషేక్ శర్మ, కేవలం నాలుగు బంతులు మాత్రమే క్రీజులో నిలిచాడు. అందులో ఒక సిక్స్ బాదిన వెంటనే, తదుపరి బంతికి మళ్లీ పెద్ద షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో అతని ఖాతాలో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేరాయి.

గత టీ20 మ్యాచ్‌లో అభిషేక్‌ను అవుట్ చేసిన వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్, ఈ మ్యాచ్‌లోనూ అతడిని పెవిలియన్ చేర్చాడు. సిక్స్ పడిన తదుపరి బంతికే పాల్ తన లెంగ్త్‌ను చాలా స్వల్పంగా మార్చి అభిషేక్ వికెట్ తీశాడు.

అభిషేక్ శర్మ చివరి 5 ఇన్నింగ్స్‌ల గణాంకాలు

1వ మ్యాచ్: 21 (11 బంతులు)

2వ మ్యాచ్: 20 (12 బంతులు)

3వ మ్యాచ్: 69 (30 బంతులు)

4వ మ్యాచ్: 29 (24 బంతులు)

5వ మ్యాచ్: 6 (4 బంతులు)

మొత్తం: 145 పరుగులు (సగటు: 29)

24
ఇయాన్ బిషప్ ఏమన్నారంటే?

అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరుపై విండీస్ దిగ్గజం, వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "గత బంతి సిక్స్ పోయిన తర్వాత కీమో పాల్ చేసిన మార్పు అద్భుతం. విండీస్ బౌలర్లు అభిషేక్ బాడీకి నేరుగా వచ్చే స్ట్రెయిట్ బాల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆఖరి బంతి ఫుల్‌గా పడటంతో పాల్ తన లెంగ్త్‌ను స్వల్పంగా మార్చుకున్నాడు, దానికి తగ్గ ఫలితం దక్కింది. అభిషేక్ శర్మలోని చిన్న బలహీనతను విండీస్ బౌలర్లు పక్కాగా వాడుకున్నారు. సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో అభిషేక్ విఫలమయ్యాడు" అని బిషప్ విశ్లేషించారు.

గత కొన్ని మ్యాచ్‌లుగా వెస్టిండీస్ బౌలర్లు అభిషేక్ బాడీకి స్ట్రెయిట్ డెలివరీలు వేస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. ఈ రకమైన బౌలింగ్ తంత్రానికి అభిషేక్ వద్ద సరైన సమాధానం లేకుండా పోయింది. ఎలాంటి మ్యాచ్ నైనా కొద్ది ఓవర్లలోనే తిప్పేసే పవర్, భయం లేని ఆటతీరు అభిషేక్ సొంతం. అందుకే మేనేజ్‌మెంట్ అతనికి ఫుల్ సపోర్టు ఇస్తోంది. కానీ స్ట్రెయిట్ బాల్స్‌ను ఎదుర్కొనే మార్గం వెతుక్కుంటేనే అతనికి కన్సిస్టెన్సీ లభిస్తుంది.

34
టీ20 వరల్డ్ కప్‌లో ఫామ్ లేమి, ఆఫ్‌స్పిన్ మ్యాచ్‌అప్

2026 టీ20 ప్రపంచకప్‌లోనూ ఐసీసీ టీ20 నంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. టోర్నీలో ఆడిన మ్యాచ్‌ల్లో అతను వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యాడు. కడుపులో ఇన్ఫెక్షన్ కావడం, బ్యాట్ స్వింగ్‌కు సహకరించని స్లో పిచ్‌లు అతడి ఆటతీరును దెబ్బతీశాయి. అప్పటికీ గడిచిన ఏడు టీ20 ఇన్నింగ్స్‌లలో అభిషేక్ వరుస సార్లు డకౌట్ కావడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపెట్టింది.

2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా, 192 పైగా స్ట్రైక్ రేట్‌తో మెరిసిన అభిషేక్ కేవలం ఒక మంచి ఇన్నింగ్స్‌కు దూరంగా ఉన్నాడని ఆ సమయంలో బ్యాటింగ్ కోచ్ సీతాంశు కొటక్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే ఆఫ్‌స్పిన్నర్ల మ్యాచ్‌అప్ అభిషేక్‌కు పెద్ద ప్రతిబంధకంగా మారింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో సల్మాన్ అలీ ఆగా తొలి ఓవర్లోనే అతడిని అవుట్ చేయగా, నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆర్యన్ దత్ కూడా మొదటి ఓవర్లోనే పెవిలియన్ పంపాడు.

44
ఐపీఎల్ కోచ్ ఏమన్నారంటే?

అభిషేక్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్‌ను ప్రత్యర్థి జట్లు పూర్తిగా డికోడ్ చేశాయా అనే ప్రశ్నపై ఐపీఎల్ లో అనుభవం ఉన్న ఒక ఫ్రాంచైజీ బ్యాటింగ్ కోచ్ కీలక వివరణ ఇచ్చారు. జట్లు అభిషేక్‌ను డికోడ్ చేశాయనే వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

"అస్సలు లేదు. మొదటి మ్యాచ్‌లో డీప్ ఎక్స్ట్రా కవర్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన బంతి సిక్స్ పోవాల్సింది లేదా ఫీల్డర్‌కు అటూ ఇటూ పడితే ఫోర్ అయ్యేది. ఇక ఆఫ్‌స్పిన్నర్ లోపలికి వేసిన బంతికి బౌల్డ్ అవ్వడం పెద్ద బలహీనతేమీ కాదు. మిడ్-ఆన్‌లో క్యాచ్ ఇవ్వడం కూడా సాధారణ పరిణామమే" అని సదరు కోచ్ అభిప్రాయపడ్డారు.

డేటా ప్రకారం, ఆఫ్‌స్పిన్నర్లకు రెండుసార్లు అవుట్ అయినంత మాత్రాన అభిషేక్ వారిపై ఇబ్బంది పడుతున్నట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. 2024 ప్రారంభం నుండి టీ20ల్లో స్పిన్‌పై కనీసం 100 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లలో అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 206.59గా ఉంది. ఇది టోర్నీలోనే అత్యుత్తమం. ప్రారంభ ఓవర్లలో కొద్దిగా నిలకడగా, ప్రశాంతంగా ఆడితే అభిషేక్ శర్మ తిరుగుండదని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories