Deepti Sharma: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో 200+ పరుగులు, 15+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచింది. ఫైనల్ లో కీలక వికెట్లు తీసుకుని సైతాఫ్రికాకు షాకిచ్చింది.
ముంబై నవి లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 2) జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తుచూస్తూ టీమిండియా విజేతగా నిలిచింది. ఈ విజయంలో కీరోల్ ప్లే చేసిన భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ తన పేరిట అరుదైన రికార్డు నమోదుచేసింది. పైనల్ మ్యాచ్ లో ఆమె 58 పరుగుల హాఫ్ సెంచరీ నాక్ ఆడారు. ఈ ఇన్నింగ్స్‌తో దీప్తి ఈ టోర్నమెంట్‌లో మొత్తం 215 పరుగులు చేశారు.
అలాగే, ఇదే మ్యాచ్ లో 5 వికెట్లు కూడా తీసుకుని తన బౌలింగ్ సత్తా ఏంటో చూపించారు. దీంతో మొత్తం 21 వికెట్లు సాధించి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా చరిత్ర సృష్టించింది. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో 200+ పరుగులు, 15+ వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా దీప్తి శర్మ నిలిచింది.
24
బ్యాట్‌తో దుమ్మురేపిన దీప్తి శర్మ
దీప్తి శర్మ ఈ టోర్నమెంట్ లో బ్యాట్‌తోనూ అవసరమైన సమయంలో పరుగులు చేశారు. శ్రీలంకపై తొలి మ్యాచ్‌లో 53 పరుగులతో టోర్నమెంట్ ఆరంభించిన ఆమె, ఇంగ్లాండ్‌పై మరో హాఫ్ సెంచరీ సాధించింది. ఇక ఫైనల్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎదురునిలిచి 58 పరుగులతో రాణించారు. మొత్తం టోర్నీలో ఆమె 30.71 సగటుతో 215 పరుగులు సాధించింది. ఫైనల్‌లో హార్మన్‌ప్రీత్ కౌర్‌తో 52 పరుగుల భాగస్వామ్యం, రిచా ఘోష్‌తో 47 పరుగుల భాగస్వామ్యం చేసి భారత ఇన్నింగ్స్‌ను 298 పరుగులకు చేర్చింది.
34
బౌలింగ్‌లో దీప్తిశర్మ దూకుడు
దీప్తి బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణించింది. 21 వికెట్లతో ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది. ఫైనల్ లో 5/39 వికెట్లతో బెస్ట్ ఫిగర్స్ ను నమోదుచేసింది. ఆమె నాలుగు మ్యాచ్‌ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్‌పై 4/51, శ్రీలంకపై 3/54, పాకిస్తాన్‌పై 3/45 తీయడం ద్వారా తన ఆల్‌రౌండ్ సామర్థ్యాన్ని చూపించింది.
2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ విజయంతో టీమిండియా తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, ఆఫ్రికన్ జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ఫైనల్‌లో 52 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో 2005, 2017లో జరిగిన ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది. టీమిండియా ఆల్ రౌండ్ షో తో తొలిసారి టైటిల్ గెలవాలనే దక్షిణాఫ్రికా కల చెదిరిపోయింది.