IPL 2026 : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక పీడకల మిగిలింది. అసలు ఈ మ్యాచ్ లో ముంబై ఎందుకు ఓడిపోయింది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో డిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయం అందుకుని పాయింట్స్ టేబుల్ లో టాప్ కు చేరింది. సొంత మైదానంలో చెలరేగి ఆడిన డిసి బలమైన ముంబై ఇండియన్స్ ని చిత్తుచేసింది. ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్ అయిన ముంబై టీంని డిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో షాకిచ్చింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగినా ముంబైకి ఓటమి తప్పలేదు... డిల్లీ బ్యాటర్ సమీర్ రిజ్వీ 90 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ముందు వీరు నిలవలేకపోయారు.
అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఓటమికి కారణమేంటి... సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీనా..? రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడకపోవడమా..? టీం చెత్త ఫీల్డింగా..? బ్యాటింగ్ వైఫల్యమా..? ముంబై ఓటమికి దారితీసిన 5 కీలక కారణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
27
1. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ విధ్వంసం
ఢిల్లీ తరఫున 'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దిగిన సమీర్ రిజ్వీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 51 బంతుల్లో 90 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రిజ్వీకి ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో ముంబై చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నాడు.
37
2. హార్దిక్ పాండ్యా లేకపోవడం..
టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా లేడని తర్వాత తెలిసింది. రెగ్యులర్ కెప్టెన్, ఫినిషర్ హార్దిక్ లేని లోటు ముంబైకి స్పష్టంగా కనిపించింది. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల బ్యాటర్ మిడిల్ ఆర్డర్‌లో కరువయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ పాథుమ్ నిస్సంకకు ఒకటి కాదు, రెండుసార్లు లైఫ్ లభించింది. మొదట దీపక్ చాహర్, ఆ తర్వాత నమన్ ధీర్ అతనిచ్చిన సులభమైన క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న నిస్సంక 44 పరుగులు చేసి ఢిల్లీకి అవసరమైన బలమైన పునాది వేశాడు.
57
4. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్
రోహిత్ శర్మ (35 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (51 పరుగులు) 10వ సారి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు మంచి ప్లాట్‌ఫామ్ అందించారు. కానీ వాళ్లిద్దరూ ఔటైన తర్వాత ముంబై బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. చిన్న బౌండరీలున్న ఈ మైదానంలో 162 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు.
67
5. ముఖేష్ కుమార్ సూపర్ బౌలింగ్
ఢిల్లీ బౌలర్ ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయడమే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. తన బౌలింగ్‌లోనే తిలక్ వర్మ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను 'క్యాచ్ అండ్ బౌల్డ్' రూపంలో పట్టుకొని ముంబైని దెబ్బకొట్టాడు. అంతేకాకుండా మరో రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి ముంబై భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.
77
DC vs MI మ్యాచ్ రికార్డులు..
రోహిత్ శర్మ ఢిల్లీపై 50 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు.
సూర్య-రోహిత్ జోడీ ముంబై తరఫున 10వ సారి 50+ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
ముంబై ఓడిపోయినా జస్ప్రీత్ బుమ్రా డైరెక్ట్ హిట్‌తో నితీశ్ రాణాను రనౌట్ చేసిన తీరు అభిమానుల మనసు గెలుచుకుంది.