IPL 2026 : 210 రన్స్ ఛేజింగ్.. పంజాబ్ కింగ్స్ సృష్టించిన వరల్డ్ రికార్డులు ఇవే !

Published : Apr 04, 2026, 09:03 AM IST

Punjab Kings : ఐపీఎల్ 2026లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. చెపాక్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేస్తూ పలు రికార్డులను తిరగరాసింది. ఆ రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి..

PREV
15
పంజాబ్ కింగ్స్ రికార్డు ఛేజింగ్

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మ్యాచ్ రికార్డుల వేటగా మారింది. పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడమే కాకుండా, చెన్నై హోమ్ గ్రౌండ్‌లో పలు అరుదైన రికార్డలను తన ఖాతాల్ వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ నమోదు చేసిన అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లలో ఇది రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2025లో కేకేఆర్ పై 262 పరుగులు ఛేదించిన రికార్డు పంజాబ్ పేరిట ఉంది.

25
చెపాక్‌లో పంజాబ్ జోరు.. చెన్నై బేజారు

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైని ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే పంజాబ్ కింగ్స్ ఇక్కడ వరుసగా 4 విజయాలను (2023-26) నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఈ మైదానంలో చెన్నైపై వరుసగా ఎక్కువ విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ (5 విజయాలు) తర్వాత పంజాబ్ రెండో స్థానంలో నిలిచింది.

35
200+ పరుగుల ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ రికార్డు

టీ20 క్రికెట్ చరిత్రలో 200 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధిక సార్లు విజయవంతంగా ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సృష్టించింది. పంజాబ్ ఇప్పటివరకు 9 సార్లు ఈ ఫీట్ సాధించగా, ఆస్ట్రేలియా జట్టు 7 సార్లు సాధించి రెండో స్థానంలో ఉంది. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ 200 పైగా పరుగులు చేసి పంజాబ్ చేతిలో ఓడిపోవడం ఇది ఐదోసారి. టీ20ల్లో ఒకే ప్రత్యర్థిపై 200+ స్కోరు చేసి ఇన్నిసార్లు ఓడిపోవడం ప్రపంచ రికార్డుగా నమోదైంది.

45
యంగ్ సెన్సేషన్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం

పంజాబ్ కింగ్స్ విజయంలో యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య కీలక పాత్ర పోషించాడు. కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ ప్రదర్శనకు గాను అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కేవలం 11 అంతకంటే తక్కువ బంతులు ఆడి, బౌలింగ్ చేయకుండా లేదా ఫీల్డింగ్‌లో ఎలాంటి అవుట్ చేయకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన రెండో ఆటగాడిగా ప్రియాన్ష్ రికార్డు సాధించాడు.

55
చెన్నైకి షాక్.. పంజాబ్ వరుస విజయాలు

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. 2022 తర్వాత ఒక సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో చెన్నై ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. మరోవైపు, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అద్భుతమైన ఆరంభాన్ని పొందింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ బౌలర్లు సరైన సమయంలో ప్రదర్శన చేయలేకపోవడమే ఓటమికి కారణమని పేర్కొన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories