CSK ధోనీ మ్యాజిక్ ఫలిస్తుందా? సీఎస్కే విజయాల బాట పడుతుందా??
ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత నిరాశాజనకమైన ఆటతీరు కనబరుస్తున్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన ఆరు మ్యాచ్ లలో ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సీఎస్కే ప్లే ఆఫ్స్ కి చేరడం కష్టమైన పనే.. కానీ అసాధ్యం మాత్రం కాదు. కొన్ని మ్యాచ్ ల తర్వాత ఐపీఎల్ 2025లో సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ తిరిగి రావడం ఆ జట్టుకు పెద్ద బలం. ధోనీ కెప్టెన్ గా మొదటి టీ20లో పరాజయం పాలైనా మిగతా మ్యాచ్లలో తిరిగి విజయాలవైపు నడిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మిస్టర్ కూల్ గా పేరున్న ధోనీ తన అనుభవం, ప్రశాంత నాయకత్వం, వ్యూహాత్మక నైపుణ్యంతో తన వైపునకు తిప్పుకుంటాడని ఆశిస్తున్నారు.