IPL Auction 2026 : అబుదాబిలో జరగనున్న ఐపీఎల్ 2026 వేలానికి ముందు జియో హాట్‌స్టార్ నిర్వహించిన మాక్ ఆక్షన్‌లో కామెరాన్ గ్రీన్ రూ. 30.50 కోట్లకు అమ్ముడయ్యాడు. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ భారీ ధర పలకగా, పలువురు స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.
క్రికెట్ అభిమానుల నిరీక్షణ ముగియనుంది. అబుదాబి లో ఐపీఎల్ 2026 కోసం భారీ వేలం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 359 మంది ఆటగాళ్ళ భవిష్యత్తు తేలనుంది. అయితే, అసలైన వేలానికి 24 గంటల ముందు అంటే సోమవారం జియో హాట్‌స్టార్ లో ఒక ఆసక్తికరమైన మాక్ ఆక్షన్ (Mock Auction) నిర్వహించారు.
ఈ మాక్ ఆక్షన్‌లో క్రికెట్ ప్రపంచానికి చెందిన పలువురు దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు పాల్గొన్నారు. అసలైన వేలానికి రిహార్సల్ లాంటి ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ పై కాసుల వర్షం కురిసింది. అలాగే దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత యువ కెరటం సర్ఫరాజ్ ఖాన్ కూడా అనూహ్యమైన ధరకు అమ్ముడయ్యాడు.
26
IPL మాక్ ఆక్షన్‌లో పాల్గొన్న క్రికెటర్లు ఎవరు?
జియో హాట్ స్టార్ నిర్వహించిన ఈ మాక్ ఆక్షన్‌లో మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీల తరపున ప్రాతినిధ్యం వహించడానికి 10 మంది మాజీ భారత క్రికెటర్లను ఆహ్వానించారు. వారు ఆయా జట్ల తరపున బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
గుజరాత్: చటేశ్వర్ పుజారా
ఢిల్లీ: మహమ్మద్ కైఫ్
బెంగళూరు: అనిల్ కుంబ్లే
పంజాబ్: సంజయ్ బంగర్
రాజస్థాన్: ఆకాష్ చోప్రా
చెన్నై: సురేష్ రైనా
కోల్‌కతా: రాబిన్ ఉతప్ప
ముంబై: అభినవ్ ముకుంద్
హైదరాబాద్: ఎస్ బద్రీనాథ్
లక్నో: ఇర్ఫాన్ పఠాన్
ఈ క్రికెట్ నిపుణులు తమ తమ జట్ల అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్ళను ఎంచుకునే ప్రయత్నం చేశారు.
36
కెమరూన్ గ్రీన్‌పై రూ. 30.50 కోట్ల వర్షం
ఈ మాక్ ఆక్షన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ధర. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున వేలంలో పాల్గొన్న మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప, గ్రీన్ కోసం ఖజానా మొత్తం ఖాళీ చేయడానికి సిద్ధపడ్డారు.
పోటాపోటీగా సాగిన బిడ్డింగ్‌లో రాబిన్ ఉతప్ప కామెరూన్ గ్రీన్‌ను ఏకంగా రూ. 30.50 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ మాక్ ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. కేకేఆర్ గ్రీన్‌ను సొంతం చేసుకోవడానికి ఎంతటి భారీ మొత్తాన్నైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ మాక్ ఆక్షన్ ద్వారా స్పష్టమైంది.
జియోస్టార్ మాక్ ఆక్షన్‌లో భారత స్పిన్నర్ రాహుల్ చాహర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ తరపున పాల్గొన్న సురేష్ రైనా, రాహుల్ చాహర్‌ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు.
వచ్చే సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ చాహర్‌ను వారు ఎంచుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, రాహుల్ చాహర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు రూ. 5.25 కోట్ల కంటే ఎక్కువ ధరను ఎప్పుడూ పొందలేదు. కానీ ఈ మాక్ ఆక్షన్‌లో అతని ధర రెట్టింపు కావడం విశేషం.
56
ఐపీఎల్ 2026 వేలం : టాప్ ప్లేయర్స్, సర్ఫరాజ్ ఖాన్ జాక్‌పాట్
ఈ మాక్ ఆక్షన్‌లో పలువురు స్టార్ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కూడా జాక్‌పాట్ కొట్టాడు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.
మాక్ ఆక్షన్‌లో అత్యధిక ధర పలికిన టాప్ ఆటగాళ్ల వివరాలు
కెమెరూన్ గ్రీన్: రూ. 30.50 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
లియామ్ లివింగ్‌స్టోన్: రూ. 19 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
మతీషా పతిరానా: రూ. 13 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
ఎన్రిక్ నోర్కియా: రూ. 7.50 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
సర్ఫరాజ్ ఖాన్: రూ. 7 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
66
ఐపీఎల్ 2025 వేలం: అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్లు
అత్యంత ఆసక్తికరంగా, కొంతమంది అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లకు ఈ మాక్ ఆక్షన్‌లో నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు, దీనితో అతను 'అన్‌సోల్డ్' గా మిగిలిపోయాడు.
అతనితో పాటు, న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే, ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌లను కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మాక్ ఆక్షన్‌లో వీరికి చుక్కెదురైనప్పటికీ, అసలైన వేలంలో వీరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.