10 గంటల్లో 4.6 కేజీలు తగ్గాడు.. అమన్ సెహ్రావత్ ఒలింపిక్ మెడల్ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా?

First Published | Aug 10, 2024, 10:32 PM IST

Aman Sehrawat: ఏదైనా సాధించాలంటే ఏదోఒకటి కోల్పోవాల్సిన సమయం వస్తుందని మ‌న పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన భారత్ రెజ్లర్ అమ‌న్ సెహ్రావ‌త్ విష‌యంలో కూడా ఇదే జరిగింది. అమ‌న్ విజ‌య విజయం వెనుక వున్న కష్టం మాములు విషయం కాదు..!

Aman Sehrawat: తీవ్రమైన బాధ‌లు, నిరాశ జీవితం నుంచి ఉదయించే సూర్యుడిలా వెలుగులోకి వ‌చ్చి భార‌త క్రీడా ప్ర‌పంచంలో  త‌న‌ద‌మైన ముద్ర‌వేసిన యంగ్ స్టార్ అమ‌న్ సెహ్రావ‌త్. చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన అత‌ను త‌న మామ సంర‌క్ష‌ణ‌లో పెరిగి నేడు ప్ర‌పంచ క్రీడా వేదిక‌పై ఛాంపియ‌న్ గా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ భార‌త్ కు మెడ‌ల్ అందించాడు. 

అమన్ సెహ్రావత్ కు ఆట‌ప‌ట్ల ఉన్న నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలిచే వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ త‌న బ్రాంజ్ మెడ‌ల్ బౌట్ కు ముందు ఏకంగా 4.6 కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన రీ హిగుచి చేతిలో ఓడిపోయిన త‌ర్వాత అమన్ బరువు 61.5 కిలోలకు చేరుకుంది.

Latest Videos


Aman Sehrawat

అయితే, బ్రాంజ్ మెడ‌ల్ పోరులో నిలావాలంటే త‌న కేట‌గిరీలోని 57 కేజీల‌కు త‌గ్గాలి. కేవ‌లం పది గంటల్లోనే 4.6 కిలోల బరువు తగ్గాడు. దీని కోసం తీవ్రంగా శ్ర‌మించాడు. బ్రాంజ్ మెడ‌ల్ పారిస్ ఒలింపిక్ వేదిక‌పై భార‌త జెండాను రెప‌రెప‌లాడించాడు. 

బౌట్ కు ముందు రెండో రోజు ఉదయం బరువును చూడ‌గా అమన్ షెరావత్ బరువు నిర్ణీత పరిమితిలోపు రావడంతో కోచ్‌లు జగ్మందర్ సింగ్, వీరేందర్ దహియా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అంత‌కుముందు ఫైనల్ కు చేరిన భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగట్ కేవ‌లం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత‌కు గుర‌య్యారు. 

అమన్ తన ఇద్దరు సీనియర్ కోచ్‌లతో గంటన్నర పాటు మ్యాట్‌పై ప్రాక్టీస్ తో బ‌రువు త‌గ్గే  మిషన్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత గంటసేపు వేడి నీళ్లతో స్నానం చేయాలి. చెమట ద్వారా కూడా బరువు తగ్గుతారు కాబట్టి, అరగంట విరామం తర్వాత ఐదు నిమిషాల చొప్పున ఐదు 'సౌనా బాత్' సెషన్‌లు ఉన్నాయి. చివరి సెషన్ తర్వాత, అమన్ 900 గ్రాముల అధిక బరువుతో ఉన్నాడు. 

దీంతో అమ‌న్ కు మసాజ్ చేసి, కోచ్‌లు లైట్ జాగింగ్ చేయమని చెప్పారు. దీని తర్వాత 15 నిమిషాలు నడిచాడు. ఉదయం 4.30 గంటలకు అతని బరువు 56.9 కిలోలకు చేరుకుంది. ఈ సమయంలో అమన్‌ నిమ్మకాయ, తేనె, కొంచెం కాఫీతో పాటు గోరువెచ్చని నీళ్లను మాత్ర‌మే ఆహారంగా అందించారు. ఈ స‌మ‌యంలో 'రాత్రంతా రెజ్లింగ్ మ్యాచ్‌ల వీడియోలు చూశాను' అని అమన్ చెప్పాడు. ఈ ప‌ట్టుద‌లే అమ‌న్ ను ఒలింపిక్ పోడియం పై నిల‌బెట్టాయ‌ని కోచ్ లు పేర్కొన్నారు.  

click me!