ఒలింపిక్స్ లో 1-1 స్కోర్ చేసినా ఓడిన భారత రెజ్లర్.. బ్రాంజ్ మెడల్ పైనే రీతికా హుడా ఆశలు

First Published | Aug 10, 2024, 8:41 PM IST

Reetika Hooda : భారత రెజ్లర్ రీతికా హుడా 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయింది. దీంతో ఇప్పుడు రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకం కోసం పోటీ పడనుంది.
 

Reetika Hooda

Paris Olympics Reetika Hooda : పారిస్ ఒలింపిక్స్ 2024 లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో భార‌త రెజ్ల‌ర్ రీతికా హుడా 1-1తో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. దీంతో కైజీ ఫైనల్‌కు చేర‌గా, రిపీచేజ్ రౌండ్‌లో రీతికా బ్రాంజ్ మెడ‌ల్ కోసం పోటీప‌డ‌నుంది.

ఇద్దరు రెజ్లర్లు ఒకే స్కోరుతో గేమ్ ను ముగించ‌డంతో చివరి పాయింట్ సాధించిన ప్లేయ‌ర్ ను విజేతగా ప్రకటించారు. ఒలింపిక్ రెజ్లింగ్ నియమాల కార‌ణంగా ఐపెరికి చివరి పాయింట్ కారణంగా విజయాన్ని అందుకుంది. దీంతో రీతికా హుడాకు నిరాశ ఎదురైంది.


అంతకుముందు తన పారిస్ ఒలింపిక్స్ ప్రయాణంలో రీతికా 12-2 టెక్నికల్ సుపీరియారిటీ  ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి అద్భుత‌మైన ఆరంభం చేసింది.

కాగా, గ‌త సంవత్సరం రీతికా అండ‌ర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. యూఎస్ఏకు చెందిన‌ కెన్నెడీ బ్లేడ్స్‌పై విజయం సాధించింది. అలాగే, సీనియర్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లు, అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 72 కేజీల విభాగంలో కాంస్య పతకాలు కూడా గెలిచారు.

రీతికా 72 కిలోల బరువు తరగతి నుండి 76 కిలోల కేటగిరీకి చేరారు. పారిస్ ఒలింపిక్స్ 2024 లో ప్ర‌స్తుతం పోటీలో ఉన్న రెజ్ల‌ర్ రీతికా హుడా మాత్ర‌మే. శుక్రవారం, అమన్ సెహ్రావత్ పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మొదటి రెజ్లింగ్ పతకాన్ని సాధించాడు. ప్యూర్టో రికో రెజ్ల‌ర్ డారియన్ క్రూజ్‌పై 13-5తో నిర్ణయాత్మక విజయంతో కాంస్యం సాధించాడు.

Latest Videos

click me!