కెప్టెన్‌గా రోహిత్.. గిల్, అయ్యర్, బుమ్రాలకు నో ప్లేస్.! 2025 బెస్ట్ వన్డే జట్టు ఇదిగో..

Published : Dec 25, 2025, 07:35 PM IST

ODI Team: 2025లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం, ఆపై వన్డేల్లో మిశ్రమ ఫలితాలను దక్కించుకుంది. మరి ఇటీవల రిలీజ్ చేసిన బెస్ట్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను లుక్ వేస్తే.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా.. విరాట్ కోహ్లీ, జో రూట్ లాంటి..

PREV
15
బెస్ట్ వన్డే టీం ఇదిగో

2025లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఈ విజయాన్ని నమోదు చేయగా.. ఆపై వన్డే ఫార్మాట్‌లో ఈ ఏడాది జట్టుకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. అయితే, 2025లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లతో కూడిన బెస్ట్ వన్డే ఎలెవన్‌ ఎవరన్న దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న రోహిత్ శర్మనే 2025 బెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు క్రికెట్ నిపుణులు. కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటర్‌గా కూడా 2025లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌లలో 650 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

25
కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్.. మూడు కోహ్లీ.!

2025 బెస్ట్ టీంకు కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ ఉండగా.. మరో ఓపెనర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఉన్నాడు. డికాక్ కూడా 2025లో అద్భుతంగా రాణించాడు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని మరీ బరిలోకి దిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు మ్యాచ్‌లలో 353 పరుగులు సాధించాడు. 70.50 సగటుతో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మూడో స్థానం మాత్రం విరాట్ కోహ్లీదే. 13 ఇన్నింగ్స్‌లలో 651 పరుగులు చేసిన విరాట్.. ఏకంగా మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.

35
నాలుగో స్థానం, ఫినిషర్ వీరే..

ఈ ఏడాది బెస్ట్ వన్డే జట్టులో నాలుగో స్థానాన్ని ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ చేజిక్కించుకున్నాడు. 2025లో 15 ఇన్నింగ్స్‌లలో 808 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది వన్డేలలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు జో రూటే. ఐదో స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ డ్యారెల్ మిచెల్ ఉన్నాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన డ్యారెల్ మిచెల్ 54.35 సగటుతో 761 పరుగులు చేశాడు.

45
లోయర్ ఆర్డర్ ఇలా..

నెంబర్ సిక్స్ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు మ్యాథ్యూ బ్రిడ్జ్కే ఉన్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో 706 పరుగులు సాధించాడు. 64.18 సగటుతో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆల్‌రౌండర్‌గా 2025లో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 ఇన్నింగ్స్‌లలో 290 పరుగులు చేసి, 11 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్‌గా శాంట్నర్ కూడా 21 వికెట్లు తీసి లోయర్ ఆర్డర్‌లో 210 పరుగులు చేశాడు.

55
పేసర్లు ఇలా ఉన్నారు..

పేసర్ల విషయానికి వస్తే.. 2025లో మ్యాట్ హెన్రీ అత్యధిక వికెట్లు(31 వికెట్లు) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతనే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ ప్లేయర్ జేడెన్ సీల్స్ 12 మ్యాచ్‌లలో 27 వికెట్లు తీసి, కేవలం 5.75 ఎకానమీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు కూడా ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ తొమ్మిది మ్యాచ్‌లలో 18 వికెట్లు తీశాడు. అయితే ఈ జట్టులో మాత్రం గిల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్స్ లేకపోవడం గమనార్హం.

Read more Photos on
click me!

Recommended Stories