U19 World Cup : అండర్-19 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ బెన్ మేయస్ స్కాట్లాండ్‌పై 191 పరుగులతో దుమ్మురేపే ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ బాది పలు రికార్డులను సమం చేశాడు.
U19 వరల్డ్ కప్: ఇంగ్లాండ్ బ్యాటర్ విశ్వరూపం.. రికార్డుల మోత మోగించిన బెన్ మేయస్
ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ నుండి యూత్ వన్డేల వరకు తనదైన శైలిలో సెంచరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
అయితే, ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో కూడా వైభవ్‌ను తలపించేలా ఒక విధ్వంసకర బ్యాటర్ తయారయ్యాడు. అతనే 18 ఏళ్ల బెన్ మేయస్. అండర్-19 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి, క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ ఆడిన తీరు చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
25
వైభవ్ సూర్యవంశీని మించిన విధ్వంసం.. ఇంగ్లాండ్ టీమ్‌లో మరో సంచలనం !
స్కాట్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెన్ మేయస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తకాషింగా స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ పోరులో స్కాటిష్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 65 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు.
క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, మైదానం నలువైపులా షాట్లు బాదాడు. మొత్తం 117 బంతులను ఎదుర్కొన్న మేయస్, 8 భారీ సిక్సర్లు, 18 ఫోర్ల సహాయంతో ఏకంగా 191 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మేయస్ బ్యాటింగ్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
35
జస్ట్ మిస్.. చేజారిన డబుల్ సెంచరీ
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బెన్ మేయస్ డబుల్ సెంచరీ చేయడం ఖాయమని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తు అతను నెర్వస్ నైంటీస్ ఔట్ కావడంతో ఆ అరుదైన మైలురాయిని అందుకోలేకపోయాడు. కేవలం 9 పరుగుల తేడాతో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.
అంతేకాకుండా, అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టడానికి అతనికి ఇంకా 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. శ్రీలంక బ్యాటర్ విరాన్ చముదిత జనవరి 17, 2026న జపాన్‌పై 143 బంతుల్లో 192 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. మేయస్ 191 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఆ రికార్డు పదిలంగా ఉంది.
రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన బెన్ మేయస్, అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో హసిత బోయగోడతో సమానంగా నిలిచాడు. 2018 జనవరి 23న కెన్యాపై హసిత బోయగోడ 152 బంతుల్లో 191 పరుగులు చేశాడు.
ఇప్పుడు మేయస్ సరిగ్గా అదే స్కోరుతో అతని సరసన చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెన్ డాకిన్స్ (5) వికెట్ కోల్పోయి 12 పరుగులకే కష్టాల్లో పడింది.
55
400 పరుగులు దాటించిన భాగస్వామ్యాలు
తొలి వికెట్ త్వరగా పడినా, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 129 బంతుల్లో 188 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోసెఫ్ 65 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా మేయస్ జోరు తగ్గలేదు. కెప్టెన్ థామస్ రేవ (22)తో కలిసి 47 పరుగులు, కాలెబ్ ఫాల్క్నర్ (32)తో కలిసి నాలుగో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు.
చివర్లో రాల్ఫీ ఆల్బర్ట్ (13)తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. మేయస్ 191 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన తర్వాత, ఫర్హాన్ అహ్మద్ (నాటౌట్ 15), సెబాస్టియన్ మోర్గాన్ (నాటౌట్ 24) జట్టు స్కోరును 400 దాటించారు. స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్ హౌస్ 3 వికెట్లు, ఫిన్లే జోన్స్ 2 వికెట్లు పడగొట్టారు.