కివీస్‌తో సిరీస్.. ఇకపై ఆ ఇద్దరి ప్లేయర్స్‌ వన్డేలకు టాటా చెప్పేసినట్టే.. ఎవరంటే.?

Published : Jan 08, 2026, 09:30 AM IST

BCCI: న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. గిల్ కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనూహ్యంగా మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్‌లకు నిరాశ ఎదురైంది.  

PREV
15
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం..

దక్షిణాఫ్రికాను వన్డే, టీ20 సిరీస్‌లలో ఓడించిన తర్వాత టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 11న వడోదరలో, 14న రాజ్‌కోట్‌లో, 18న ఇండోర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

25
మళ్లీ కెప్టెన్‌గా రీ-ఎంట్రీ

గత దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో మెడనొప్పితో బాధపడిన కెప్టెన్ గిల్.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితేనేం ఈ సిరీస్‌కు మళ్లీ కెప్టెన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్ జట్టులో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం వెనుక బలమైన కారణమే ఉండట. వన్డే ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని.. వీరిద్దరికి వైట్ బాల్ క్రికెట్‌లో ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారట.

35
చోటు దక్కే అవకాశాలు లేవు

మహమ్మద్ షమీకి జట్టులో చోటు దక్కకపోవడం పెద్ద చర్చకు దారితీసిన విషయం విదితమే. 2023 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినప్పటికీ, షమీని మేనేజ్‌మెంట్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. 2023లో తన చివరి మ్యాచ్ ఆడిన షమీకి ఇక జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

45
టీ20లకు మాత్రమే పరిమితం

మరోవైపు, డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా చోటు సంపాదించిన ఇషాన్ కిషన్‌ను టీ20లకు మాత్రమే పరిమితం చేశారు. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు అతన్ని పక్కన పెట్టారు. ఈ ఎంపిక విషయంలోనూ బీసీసీఐ తెలివిగా వ్యవహరించింది. ప్రతీ ఫార్మటు‌కు గట్టి టీంను అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందట.

55
టీమిండియాలో చోటు కష్టమే..

టీమిండియాలో చోటు కష్టమే అనుకున్న రిషబ్ పంత్, నితీశ్ రెడ్డిలకు మరోసారి అవకాశం కల్పించడం.. ధృవ్ జురెల్‌ను పక్కన పెట్టడం కూడా కీలక మార్పుల్లో ఒకటి. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఏది ఏమైనా మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాను మళ్లీ బలోపేతం చేసేందుకు గట్టి టీంను రెడీ చేస్తోంది బీసీసీఐ.

Read more Photos on
click me!

Recommended Stories