టీమిండియా ఫ్యూచర్ కోహ్లీకి బుర్రుంది.! టెస్టుల్లో ఇలా చేస్తే మనల్ని ఎవడ్రా ఆపేది..

Published : Jan 08, 2026, 09:00 AM IST

Gill: టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా ఇటీవల ఎదుర్కొన్న ఘోర పరాజయాలను జయించేందుకు కెప్టెన్ గిల్ బీసీసీఐకి కీలక సలహా ఇచ్చాడు. ప్రతి టెస్ట్ సిరీస్‌కు ముందు 15 రోజుల ప్రత్యేక క్యాంపును నిర్వహించడం ద్వారా జట్టు మెరుగైన ఆటతీరు కనబరుస్తుందని సూచించాడు. 

PREV
15
టెస్టుల్లో ఘోర పరాజయాలే..

టెస్ట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఇటీవలికాలంలో ఘోర పరాజయాలను ఎదుర్కుంది. జట్టును మళ్లీ తిరిగి గాడిలో పెట్టేందుకు టీమిండియా కెప్టెన్ గిల్ బీసీసీఐకి ఒక కీలక సలహా ఇచ్చాడట. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టు తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే, ప్రతి టెస్ట్ సిరీస్‌కు ముందు 15 రోజుల పాటు ప్రత్యేక టెస్ట్ క్యాంప్‌ను నిర్వహించాలని సూచించాడు.

25
హెడ్ కోచ్‌గా బాధ్యతలు..

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా పరాజయాల పరంపరను చవిచూసింది. 2024లో సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను చేజార్చుకుంది. ఆపై దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి ఇలా అన్ని టీమిండియాకు కష్టాలే వచ్చాయి.

35
బీసీసీఐ వివరణ..

రోహిత్ శర్మ వారసుడిగా సారధ్య బాధ్యతలు చేపట్టిన శుభ్ మాన్ గిల్, ఇంగ్లాండ్ పర్యటనలో ముందుండి జట్టును నడిపించాడు. ఆ సిరీస్‌లో 754 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి, సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి కారణంగా టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరాజయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ, జట్టు మేనేజ్‌మెంట్ నుంచి వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి.

45
కీలక సలహా..

ఈ పరిణామాల నేపథ్యంలోనే గిల్ తన కీలక సలహాను బీసీసీఐకి అందించాడు. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి సిరీస్‌కు ముందు 15 రోజుల పాటు ప్రత్యేక టెస్ట్ క్యాంప్‌ను నిర్వహించాలని అతడు సూచించాడు. బిజీ షెడ్యూల్ కారణంగా టెస్ట్ సిరీస్‌లకు ముందు జట్టుకు మెరుగైన సన్నద్ధతకు తగిన సమయం లభించడం లేదని, అందువల్ల ఈ క్యాంపులు తప్పనిసరని గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఒక బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించాడు.

55
క్యాంపులకు లక్ష్మణ్ బాధ్యతలు.?

సెలక్టర్లతో పాటు బోర్డుకు తన లక్ష్యాన్ని స్పష్టంగా వివరించాడు గిల్. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టుకు బలమైన కెప్టెన్ అవసరం ఉన్న నేపథ్యంలో ఇది సానుకూల పరిణామం. టెస్ట్, వన్డే జట్లు గిల్ పరిధిలో ఉన్నందున కీలక నిర్ణయాల్లో అతని పాత్ర ఉండటం ముఖ్యమని బీసీసీఐ భావిస్తోంది. రెడ్ బాల్ క్యాంపులను నిర్వహించడానికి నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ సేవలను బోర్డు ఉపయోగించుకునే అవకాశం ఉందని సదరు అధికారి వెల్లడించాడు.

Read more Photos on
click me!

Recommended Stories