రో కో దెబ్బ అట్లుంటది మరి.. గంభీర్-అగార్కర్‌తో బీసీసీఐ అత్యవసర భేటీ !

Published : Dec 01, 2025, 04:19 PM IST

Rohit Sharma Virat Kohli: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో మెరిశారు.  ఈ నేపథ్యంలో గంభీర్-అగార్కర్‌ను బీసీసీఐ సమావేశానికి పిలిచింది. ఏం జరుగుతోంది బాసు ? 

PREV
16
భారత జట్టులో అంతా సవ్యంగా లేదా?

ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టెస్టు సిరీస్ లో భారత్ చెత్త ప్రదర్శన ఇచ్చింది. వైట్ వాష్ తర్వాత తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఈ విమర్శలకు టార్గెట్ మారారు.

ఇదిలావుండగా, భారత జట్టులో అంతా సవ్యంగా లేదనే విషయం మళ్లీ మళ్లీ బహిర్గతమవుతోంది. రెండు టెస్టులు ఓడిన తర్వాత వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠ విజయాన్ని సాధించింది.

26
కోహ్లీ-రోహిత్ మెరుపులు: దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో అద్భుత విజయం

టెస్ట్ సిరీస్‌లో అనుభవం లేని ఆటగాళ్లతో కూడిన భారత జట్టు టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. అయితే, వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ అర్ధ సెంచరీ, విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. జట్టులో వీరి రాకతో కొత్త ఉత్సాహం కనిపించింది.

36
గంభీర్-అగార్కర్‌తో బీసీసీఐ మీటింగ్

ఈ పరిణామాల మధ్య టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌లను రెండో వన్డే మ్యాచ్‌కు ముందు కొన్ని విషయాలపై చర్చించడానికి బీసీసీఐ సమావేశానికి పిలిచింది. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ విషయం గురించి చర్చించబోతున్నారని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే, గంభీర్, అగార్కర్‌లకు మూడినట్టేనా అనే కామెంట్స్ కొత్త చర్చకు తెరలేపాయి.

46
రోహిత్ భవిష్యత్తుపై చర్చల నేపథ్యంలో కీలక సమావేశం

గత కొన్ని మ్యాచ్‌లలో కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శన కనబరిచి, తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించారు. ఈ క్రమంలోనే మళ్లీ టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను క్రికెట్ లవర్స్, పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ఈ స్టార్లు ప్లేయర్ల భవిష్యత్తు గురించి చర్చ జరుగుతున్న తరుణంలో బీసీసీఐ సమావేశం జరగడం చాలా ఆసక్తికరంగా మారింది.

56
బీసీసీఐ కీలక సమావేశంలో ఎవరు పాల్గొంటారు?

స్పోర్ట్‌స్టార్ రిపోర్టుల ప్రకారం..  బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.

గంభీర్‌ను కోహ్లీ విస్మరించారా?

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్నేహంగా మెలగలేదు. ఒక సందర్భంలో కోహ్లీ, గంభీర్‌ను పట్టించుకోనట్టుగా నడుచుకున్న వీడియో కూడా వైరల్ అయింది. దీంతో మరోసారి టీమిండియాలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది.

66
గందరగోళానికి బీసీసీఐ తెర దించుతుందా?

గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత సీనియర్ ఆటగాళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ బీసీసీఐ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. మెన్ ఇన్ బ్లూ 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న క్రమంలో 50 ఓవర్ల సెటప్‌లో రోహిత్-కోహ్లీల భవిష్యత్తు చాలా కీలకం కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories