Kavya Maran : భారత్ అంటే పడని పాక్ ఆటగాడికి కోట్ల రూపాయలా? బీసీసీఐ ఏం చెప్పింది?

Published : Mar 13, 2026, 05:49 PM IST

Kavya Maran : ఇంగ్లాండ్ ద హండ్రెడ్ లీగ్‌లో పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై భారత్‌లో వివాదం రేగింది. ఎస్ఆర్హెచ్ కావ్య మారన్ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా బీసీసీఐ కూడా స్పందించింది.

PREV
16
ధావన్‌ను కొడతానన్న ప్లేయర్‌కు కావ్య మారన్ అండ.. నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోలింగ్!

లండన్ లో జరిగిన ద హండ్రెడ్ లీగ్ వేలం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెను సంచలనానికి దారితీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్య మారన్‌ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ, పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధరకు కొనుగోలు చేయడం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

26
2.34 కోట్లతో సన్ రైజర్స్ లోకి అబ్రార్ అహ్మద్

గురువారం (మార్చి 12) లండన్‌లో జరిగిన వేలంలో అబ్రార్ అహ్మద్‌ను దక్కించుకోవడానికి సన్‌రైజర్స్ లీడ్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అబ్రార్ బేస్ ప్రైస్ దాదాపు 92.5 లక్షల రూపాయలు కాగా, చివరికి సన్‌రైజర్స్ లీడ్స్ 1.90 లక్షల పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) అతడిని సొంతం చేసుకుంది. దీనితో, ఒక భారతీయ యాజమాన్యం కలిగిన విదేశీ లీగ్ జట్టులో ఆడుతున్న మొదటి పాకిస్థానీ ఆటగాడిగా అబ్రార్ రికార్డు సృష్టించారు. సన్ గ్రూప్ అధినేత కలానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ఈ జట్టుకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

36
భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అబ్రార్ అహ్మద్

అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వెనుక కేవలం పాక్ ఆటగాడు అనే కోణమే కాకుండా, అతని గత ప్రవర్తనపై కూడా అభిమానులు మండిపడుతున్నారు. గతంలో భారత విమాన దళ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను ఉద్దేశించి అబ్రార్ చేసిన 'ఫెంటాస్టిక్ టీ' పోస్ట్ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. 2019 బాలకోట్ దాడుల సమయంలో అభినందన్ పాక్ సైన్యానికి చిక్కినప్పుడు చేసిన వ్యాఖ్యలను అబ్రార్ ఎగతాళి చేస్తూ పోస్ట్ పెట్టారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అలాగే 2025లో భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల సమయంలోనూ అతను భారత్ వ్యతిరేక పోస్టులు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

46
శిఖర్ ధావన్‌కు బాక్సింగ్ ఛాలెంజ్

అంతేకాకుండా, గతంలో ఒక పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్రార్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఏ అంతర్జాతీయ ఆటగాడితో బాక్సింగ్ రింగ్‌లోకి దిగాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు, అతను భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ పేరు చెప్పాడు. దీనిని ధావన్‌కు ఇచ్చిన సవాలుగా భారత అభిమానులు భావిస్తున్నారు. ఈ కారణాల రీత్యా, దేశం పట్ల గౌరవం లేని ఆటగాడిని కావ్య మారన్ ఎలా కొనుగోలు చేస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవ మధ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం.

56
అబ్రార్ కొనుగోలు వివాదంపై బీసీసీఐ ఏం చెప్పింది?

ఈ వివాదం ముదురుతున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీనిపై స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ఈ అంశం భారత క్రికెట్ బోర్డు పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. "ఇది మా అధికార పరిధిలో లేదు. ఇది విదేశీ లీగ్‌కు సంబంధించిన విషయం. ఆ లీగ్ యాజమాన్యమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఇందులో బీసీసీఐ చేసేదేమీ లేదు" అని ఆయన వెల్లడించారు. ఇది భారత దేశంలో జరిగే ఐపీఎల్ కాకపోవడంతో బోర్డు జోక్యం చేసుకోలేమని ఆయన తేల్చి చెప్పారు.

66
కోచ్ డానియల్ విట్టోరీ ఏం చెప్పారు?

ఈ వివాదంపై సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డానియల్ విట్టోరీ క్లారిటీ ఇచ్చారు. అబ్రార్ అహ్మద్‌ను కేవలం జట్టు అవసరాల కోసమే ఎంపిక చేశామని ఆయన తెలిపారు. తమ మొదటి ప్రాధాన్యం ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అని, కానీ అతను దక్కకపోవడంతో అబ్రార్ వైపు మొగ్గు చూపామని చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన రిషాద్ హుస్సేన్, పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ పేర్లను కూడా పరిశీలించామని, కానీ అబ్రార్ వైవిధ్యమైన బౌలింగ్ హెడింగ్లీ పిచ్‌పై ప్రభావం చూపుతుందని భావించి తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని విట్టోరీ స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories