Bangladesh : పాకిస్థాన్ గతే బంగ్లాదేశ్‌కు.. ఇండియా దెబ్బకు మైండ్ బ్లాక్!

Published : Jan 09, 2026, 11:13 PM IST

Bangladesh : టీ20 ప్రపంచ కప్ ఆడటానికి అయితే భారత్ రాలేమనీ, తమ మ్యాచ్ లను మరో ప్లేస్ కు మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. బీసీసీఐ, ఐసీసీతో తలెత్తిన వివాదం కారణంగా బంగ్లా క్రికెట్ భవిష్యత్తు పాకిస్థాన్ లాగా మారే ప్రమాదంలో పడింది.

PREV
15
పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్? ఐసీసీ, బీసీసీఐతో పెట్టుకుంటే అంతే సంగతులా?

టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత్, బంగ్లాదేశ్ మధ్య తలెత్తిన వివాదం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ పరిణామంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఈ వివాదంలో బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. నిరసనగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసిన బంగ్లాదేశ్, ఇప్పుడు భద్రతా కారణాల రీత్యా భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేస్తోంది.

25
ఐసీసీకి వరుస లేఖలు రాసిన బంగ్లాదేశ్.. ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఈ క్రమంలో బీసీబీ రాసిన మొదటి లేఖలోని డిమాండ్లను ఐసీసీ పూర్తిగా తిరస్కరించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడకపోతే బంగ్లాదేశ్‌ను ఓడిపోయినట్లుగా ప్రకటించి, ఆ పాయింట్లను ప్రత్యర్థి జట్లకు కేటాయిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే, బంగ్లాదేశ్ వెనక్కి తగ్గకుండా గురువారం మరోసారి ఐసీసీకి రెండవ లేఖ రాసింది. ఇందులో మరోసారి భద్రతా కారణాలను ప్రస్తావించింది. ఐసీసీ ఈ డిమాండ్‌ను కూడా మరోసారి తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐసీసీ టోర్నీలకు బంగ్లాదేశ్ తమ సొంత ప్రతిభతో అర్హత సాధిస్తున్నప్పటికీ, షెడ్యూలింగ్ పరంగా వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. మ్యాచ్ టైమింగ్స్, ప్లేస్ కేటాయింపు, ప్రైమ్ బ్రాడ్‌కాస్ట్ స్లాట్‌ల విషయంలో ఎప్పుడూ ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే జట్లకే ప్రాముఖ్యత లభిస్తోంది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లు తరచుగా తక్కువ వ్యూయర్-షిప్ ఉండే సమయాల్లో షెడ్యూల్ లో ఉంటున్నాయి. దీనివల్ల ఆ జట్టు స్పాన్సర్ల విలువ, అంతర్జాతీయ గుర్తింపుపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

35
పాకిస్థాన్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి

బంగ్లాదేశ్ తన పరిస్థితిని మరింత దిగజార్చుకోకూడదంటే పాకిస్థాన్ చేసిన తప్పులను చేయకూడదు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ ఏకాకిగా మారిన తీరు ఒక హెచ్చరిక లాంటిది. 2013 నుంచి పాకిస్థాన్ భారత్‌తో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. కేవలం ఐసీసీ టోర్నీల కోసం మాత్రమే పాక్ జట్టు భారత్‌కు వచ్చింది. ఇప్పుడు అది కూడా హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది.

భారత్, పాకిస్థాన్ జట్లు ఒకరి దేశంలో మరొకరు ఆడటం లేదు. ఈసారి టీ20 ప్రపంచ కప్‌లో కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. పాకిస్థాన్‌ను ఐసీసీ నుంచి బహిష్కరించకపోయినా, పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించినా, భారత్ అక్కడికి వెళ్లకపోవడంతో ఆశించిన ప్రయోజనం దక్కలేదు. భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే బాటలో నడిస్తే క్రికెట్ ప్రపంచంలో ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

45
బంగ్లాదేశ్ తప్పుకుంటే ఏం జరుగుతుంది? ఆర్థికంగా తీవ్ర నష్టం తప్పదు

ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటే, వారి గ్రూప్‌లోని ప్రత్యర్థి జట్లకు ఉచితంగా పాయింట్లు లభిస్తాయి. ఐసీసీ కావాలనుకుంటే వేరే జట్టును టోర్నీలో చేర్చవచ్చు. అయితే ఇది చాలా క్లిష్టమైన సమస్య కాబట్టి పరిస్థితి అంత దూరం వెళ్లకూడదని అందరూ కోరుకుంటున్నారు. జై షా నేతృత్వంలోని ఐసీసీ ఈ వ్యవహారాన్ని చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.

బంగ్లాదేశ్ గనుక ఐసీసీ మాటకు కట్టుబడి ఉండకపోతే, కేవలం బీసీసీఐతోనే కాకుండా ఐసీసీతో కూడా సంబంధాలు దెబ్బతింటాయి. గత దశాబ్ద కాలంగా ఐసీసీ ఆర్థిక లెక్కల ప్రకారం, గ్లోబల్ క్రికెట్ రాబడిలో 70 శాతానికి పైగా వాటా భారత్ నుంచే వస్తోంది. 2016 నుంచి 2023 మధ్య కాలంలో ఐసీసీ మొత్తం రాబడిలో బీసీసీఐ 35 శాతానికి పైగా వాటాను పొందితే, బంగ్లాదేశ్ వంటి బోర్డులకు కేవలం 4-6 శాతం మాత్రమే దక్కింది. షెడ్యూలింగ్, టోర్నీ ఫార్మాట్ నిర్ణయాల్లో ఆదాయ భద్రతకే పెద్దపీట వేస్తారు. ఈ విషయంలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా ఉంది. 2000 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.

55
బంగ్లా భవిష్యత్తుపై ప్రభావం

ఈ ఉద్రిక్తతలు కొనసాగితే, దాని ప్రభావం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రాబడిపై స్పష్టంగా కనిపిస్తుంది. ఐసీసీ టోర్నమెంట్ సైకిల్ ద్వారా బీసీబీకి వచ్చే వార్షిక ఆదాయం దాదాపు 25-30 శాతం ఉంటుంది. మైదానంలో తక్కువగా కనిపించడం వల్ల స్పాన్సర్‌షిప్ రెన్యూవల్స్ కష్టమవుతాయి. తక్కువ ఒత్తిడి గల మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆటగాళ్ల నైపుణ్యం దెబ్బతింటుంది.

బంగ్లాదేశ్‌లో క్రికెట్ అనేది జాతీయవాదంతో ముడిపడి ఉంది. బోర్డు తీసుకునే తప్పుడు నిర్ణయాలు దేశీయంగా రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చు. ఆధునిక క్రికెట్‌లో ఒక జట్టును పక్కన పెట్టడం అంటే బహిష్కరించడం కాదు, షెడ్యూలింగ్, ఆదాయం పరంగా ప్రాధాన్యం తగ్గించడమే. ఆర్థికాంశాలే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ వ్యవస్థలో తమ ఉనికిని కాపాడుకోవడం బంగ్లాదేశ్‌కు పెద్ద సవాలుగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories