ఆసియా కప్ హాకీ 2025: హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో చైనాపై భారత్‌ గెలుపు

Published : Aug 30, 2025, 08:49 AM ISTUpdated : Aug 30, 2025, 09:05 AM IST

Asia Cup Hockey 2025: హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్, జుగ్రాజ్ సింగ్ గోల్‌తో భారత్ ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో చైనాపై 4-3 తేడాతో విజయం సాధించింది. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.

PREV
16
రాజ్‌గిర్‌లో ఉత్కంఠభరిత ఆరంభంతో ఆసియా కప్ హాకీ 2025

ఆసియా కప్ హాకీ 2025 శుక్రవారం బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో ప్రారంభమైంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో చైనాపై విజయం సాధించింది. మొత్తం ఏడు గోల్స్‌ అన్ని పెనాల్టీ కార్నర్స్ ద్వారానే రావడం ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది. 

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ సాధించగా, జుగ్రాజ్ సింగ్ ఒక గోల్ చేశారు. మరోవైపు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో ఉన్న చైనా తరఫున షిహావో డు, బెన్‌హై చెన్, జియెషెంగ్ గావో తలా ఒక గోల్ సాధించారు.

DID YOU KNOW ?
ఆసియా కప్ హాకీలో భారత్
భారత్ హాకీ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ఆసియా కప్ గెలిచింది. 2003లో పాకిస్తాన్‌పై, 2007లో కొరియాపై, 2017లో మలేషియాపై విజయం సాధించింది.
26
తొలి క్వార్టర్‌లో చైనా ఆధిక్యం

మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ప్రారంభ దాడులను చైనా డిఫెన్స్ తట్టుకుని, 12వ నిమిషంలో షిహావో డు పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి చైనాకు ఆధిక్యం అందించాడు. భారత్ కౌంటర్ అటాక్ ప్రయత్నించినా తొలి క్వార్టర్ ముగిసే సరికి స్కోరు 1-0తో చైనా ఆధిక్యంలో నిలిచింది.

36
రెండో క్వార్టర్‌లో భారత్ పుంజుకుంది

రెండో క్వార్టర్‌లో భారత్ మూడో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ సాధించింది. జుగ్రాజ్ సింగ్ శక్తివంతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో స్కోరు 1-1గా సమం చేశారు. రెండు నిమిషాలకే మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మార్చి భారత్‌ను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. ఈ ఆధిక్యాన్ని భారత్ కాపాడుకుంటూ హాఫ్‌టైమ్‌కు 2-1 స్కోరుతో ముందంజలో నిలిచింది.

46
మూడో క్వార్టర్‌లో ఉత్కంఠ

హాఫ్‌టైమ్ తర్వాత భారత్ దూకుడు కొనసాగించింది. 33వ నిమిషంలో మరోసారి హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి స్కోరును 3-1 చేశారు. కానీ చైనా వెనక్కి తగ్గలేదు. 35వ నిమిషంలో బెన్‌హై చెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి స్కోరును 3-2 చేశారు. 

ఆపై చైనా దాడులు మరింత ఉధృతం అయ్యాయి. 41వ నిమిషంలో జియెషెంగ్ గావో మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా చేసి స్కోరును 3-3 సమం చేశారు. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి రెండు జట్లు సమాన స్థాయిలో నిలిచాయి.

56
చివరి క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్

నాలుగో క్వార్టర్ ప్రారంభంలో భారత్ వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించింది. 47వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో తన హ్యాట్రిక్ పూర్తి చేసి భారత్‌కు 4-3 ఆధిక్యం ఇచ్చారు. ఆపై భారత్ బాల్ పాజెషన్‌ను కంట్రోల్ చేస్తూ, చైనాపై ప్రెజర్ కొనసాగించింది.

 జర్మన్‌ప్రీత్ సింగ్ ఐదు నిమిషాలపాటు యెల్లో కార్డ్ కారణంగా బయటకు వెళ్ళినా, భారత్ తన దూకుడుతో బలంగా నిలిచింది. చైనాకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషాల వరకు ఉత్కంఠ కొనసాగినా భారత్ 4-3 ఆధిక్యాన్ని నిలబెట్టుకుని విజయం సాధించింది.

66
భారత్ vs చైనా : మ్యాచ్ ముఖ్యాంశాలు

• భారత్ గోల్స్: హర్మన్‌ప్రీత్ సింగ్ (20’, 33’, 47’), జుగ్రాజ్ సింగ్ (18’)

• చైనా గోల్స్: షిహావో డు (12’), బెన్‌హై చెన్ (35’), జియెషెంగ్ గావో (41’)

• మొత్తం 7 గోల్స్‌ అన్నీ పెనాల్టీ కార్నర్స్ ద్వారానే వచ్చాయి.

• హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశారు.

• మ్యాచ్ జరిగిన స్థలం: రాజ్‌గిర్ హాకీ స్టేడియం, బీహార్

జపాన్ తో తర్వాతి మ్యాచ్ ఆడనున్న భారత్ 

ఈ విజయంతో భారత్ ఆసియా కప్ 2025లో విజయవంతమైన ఆరంభం చేసింది. పూల్-ఏ లో భాగంగా భారత్ తమ రెండో మ్యాచ్‌ను జపాన్ తో ఆడనుంది. ప్రతి గ్రూప్‌లో టాప్ 2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories