Arrest virat kohli: కోహ్లిని అరెస్ట్ చేయండి.. నెట్టింట్ ట్రెండ్ అవుతోన్న కొత్త హ్యాష్ ట్యాగ్

Published : Jun 06, 2025, 11:11 PM IST

ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజయం త‌ర్వాత వేడుక‌ల్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు ఎక్స్ వేదిక‌గా ఓ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

PREV
14
వైరల్ అవుతున్న #ArrestKohli

విరాట్ కోహ్లీపై కోపంతో కొంత‌మంది నెటిజన్లు “అరెస్ట్‌కోహ్లి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయడం మొదలుపెట్టారు. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఇది 18 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి విజయం కావడంతో, కోహ్లీని చూసేందుకు వేలాది మంది అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.

 ఆ గందరగోళంలో ప‌లువురు ప్ర‌జ‌లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కొంతమంది త‌ప్పంతా కోహ్లీదే అంటూ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే మరికొంతమంది ఈ ట్రెండ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు.

24
అసలు నేరస్తులు ఎవరు?

కొందరు నెటిజన్లు స్పందిస్తూ, “#ArrestKohli ట్రెండ్ చేయడం చాలా మూర్ఖత్వం అంటూ కొంద‌రు కోహ్లికి అండ‌గా నిలుస్తున్నారు. అసలు నేరస్తులు ప్రభుత్వం, ఈవెంట్ నిర్వాహకులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కోహ్లి త‌ప్పేం ఉందంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

34
కోహ్లీపై ఎందుకు కోపం?

ఒకవైపు విరాట్ కోహ్లీపై భారత్ రత్న ఇవ్వాలని క్రికెటర్ సురేష్ రైనా అభ్యర్థించగా, మరోవైపు కొంతమంది నెటిజన్లు అతన్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌కి ఇప్పటికే 45,000కు పైగా పోస్ట్‌లు వచ్చాయి.

44
అల్లు అర్జున్ సంఘ‌ట‌న‌ను ఉదాహ‌రిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సంఘ‌ట‌న‌ను గ‌తంలో హైద‌రాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిస‌లాట‌తో పోల్చుతున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకే ఇప్పుడు కోహ్లిని అరెస్ట్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప‌2 విడుద‌లప్పుడు జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఒక మహిళ మ‌ర‌ణించ‌గా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories