టీ20 ప్రపంచకప్‌ 2026 : రేసులో 20 జట్లు.. దబిడిదిబిడే !

Published : Oct 22, 2025, 09:57 PM ISTUpdated : Oct 23, 2025, 01:54 PM IST

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం అర్హత పొందిన 20 జట్ల పూర్తి జాబితా విడుదలైంది. ఆఖరి మూడు స్థానాలు నేపాల్, ఒమన్, యూఏఈ భర్తీ చేశాయి. ఐసీసీ టైటిల్ కోసం పోటీ పడుతున్న జట్లతో పాటు ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
17
టీ20 ప్రపంచకప్ 2026లో మొత్తం 20 జట్ల పోటీ

2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం అర్హత సాధించిన 20 జట్ల జాబితా విడుదలైంది. టోర్నమెంట్ ఫిబ్రవరి-మార్చి 2026లో జరగనుంది. ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదు.

27
టీ20 ప్రపంచకప్ 2026 కోసం అర్హత పొందిన చిన్న జట్లు

తాజాగా జరిగిన ఆసియా, ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫయర్ టోర్నీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), నేపాల్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. యూఏఈ చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జపాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి అర్హత పొందింది. హైదర్ అలీ 3 వికెట్లు (3/20), ఓపెనర్లు అలీషాన్ షరఫు, మొహమ్మద్ వసీమ్‌ల 70 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. నేపాల్‌కు ఇది వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ అర్హత కాగా, మొత్తంగా మూడోసారి మెగా టోర్నీ ఆడనుంది. ఒమన్‌కు ఇది నాలుగోసారి, యూఏఈ మూడోసారి అర్హత సాధించాయి.

37
టీ20 ప్రపంచకప్ 2026 హోస్ట్ దేశాలుగా భారత్, శ్రీలంక

ఈ టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక హోస్ట్‌లుగా వ్యవహరించనున్నాయి. భారత్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా టోర్నీలో ప్రవేశిస్తుంది. 2024లో జరిగిన తుదిపోరులో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ సాధించింది. టీ20 ప్రపంచకప్‌ను ఒకటికంటే ఎక్కువసార్లు గెలిచిన జట్లలో భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ లు ఉన్నాయి.

47
టీ20 ప్రపంచకప్ 2026: వివిధ దేశాలు ఎలా అర్హత సాధించాయి?

మొత్తం 20 జట్లు టీ20 ప్రపంచకప్ 2026 లో ఆడనున్నాయి. వాటి అర్హతలు గమనిస్తే..

  • హోస్ట్ నేషన్స్ గా: భారత్, శ్రీలంక
  • 2024 టోర్నమెంట్ టాప్ 7: దక్షిణాఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బాంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్
  • • ఐసీసీ ర్యాంకింగ్స్ ద్వారా: న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్
  • • అమెరికాస్ క్వాలిఫయర్: కెనడా
  • • యూరప్ క్వాలిఫయర్: ఇటలీ (మొదటిసారి), నెదర్లాండ్స్
  • • ఆఫ్రికా క్వాలిఫయర్: నమీబియా, జింబాబ్వే
  • • ఆసియా/EAP క్వాలిఫయర్: నేపాల్, ఒమన్, యూఏఈ
57
టీ20 ప్రపంచకప్ 2026 ఫార్మాట్ ఎలా ఉంటుంది?

2024 టోర్నమెంట్ ఫార్మాట్‌నే 2026కు కొనసాగిస్తున్నారు..

1. గ్రూప్ స్టేజ్

20 జట్లు 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 5 జట్లు ఉంటాయి. రౌండ్-రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మరో జట్టుతో ఒక్కసారి పోటీ పడుతుంది. భారత్, పాకిస్తాలు మరోసారి ఒకే గ్రూప్ లో ఉండే ఛాన్స్ ఉంది.

2. సూపర్ 8 స్టేజ్

ప్రతి గ్రూపులోని టాప్ 2 జట్లు సూపర్ 8కు అర్హత పొందుతాయి. ఇక్కడ 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి మరొక రౌండ్-రాబిన్ స్టేజ్ ఉంటుంది.

3. నాకౌట్ దశ

సూపర్ 8లో టాప్ 2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత పొందతాయి. విజేతలు ఫైనల్‌లో తలపడతారు.

67
టీ20 ప్రపంచకప్ 2026 అర్హత పొందిన 20 జట్ల పూర్తి జాబితా ఇదే
  1. భారత్ 
  2. శ్రీలంక 
  3. ఆఫ్గానిస్తాన్
  4. ఆస్ట్రేలియా
  5. బాంగ్లాదేశ్
  6. ఇంగ్లాండ్
  7. దక్షిణాఫ్రికా
  8. యూఎస్ఏ
  9. వెస్టిండీస్
  10. ఐర్లాండ్
  11. న్యూజిలాండ్
  12. పాకిస్తాన్
  13. కెనడా
  14. ఇటలీ
  15. నెదర్లాండ్స్
  16. నమీబియా
  17. జింబాబ్వే
  18. నేపాల్
  19. ఒమన్
  20. యూఏఈ
77
టీ20 ప్రపంచకప్ 2026 లో సంచలనాలు !

ఈసారి ఇటలీ మొట్టమొదటిసారిగా టీ20 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టనుంది. ర్యాంకింగ్స్ ద్వారా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ కూడా టోర్నీలోకి వచ్చాయి.

అమెరికా 2024 టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌దృష్టిని ఆకర్షించింది. ఇక అఫ్గానిస్తాన్ కూడా టీ20 ఫార్మాట్‌లో తమ స్థానం నిలబెట్టుకుంది. టాప్ జట్లకు సైతం షాకిచ్చింది. ఒమన్ కూడా గట్టి పోటీనిచ్చే జట్టుగా ఎదుగుతోంది. నేపాల్ లో సంచలనాలు రేపే ప్లేయర్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్ అత్యంత ఉత్కంఠభరితమైన టోర్నమెంట్‌గా సాగే అవకాశాలు ఉన్నాయి. మరో క్రికెట్ ఫెస్టివల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories